(॥పల్లవి॥)
తలచిన పనులెల్లఁ దలకూడెను
తలిరుఁబోడికి నీకుఁ దగునయ్యా
(॥తల॥)
వింతగా చెలినవ్వులే వెన్నెల బాయలు నీకు
పొంత నధరామృతమే పులుఁగాలు
దొంతివెట్టి వలపులు తోడఁ దొడ నీ కెదురు
చింతతోఁ జూడఁ దొడఁగె చేకొనవయ్యా
(॥తల॥)
చిక్కని జవ్వన మిదె సింగారపుఁదోఁట నీకు
పుక్కిటివీడేలు వనభోజనాలు
మక్కువఁ బానుపుమీఁది మాటలప్రియాలతోనే
యెక్కువ విందులు చెప్పీ నియ్యకొనవయ్యా
(॥తల॥)
యాపెకాఁగిలే నీకు నెసఁగఁ బెండ్లిచవికె
పూపఁబలుకుఁ దేనెలే బువ్వాలు
యేపొద్దు శ్రీవేంకటేశ యెనసి రతుల నిన్ను
తీపులు పుట్టించె నన్నీఁ దెలుసుకోవయ్యా
(||pallavi||)
talasina panulĕllam̐ dalagūḍĕnu
talirum̐boḍigi nīgum̐ dagunayyā
(||tala||)
viṁtagā sĕlinavvule vĕnnĕla bāyalu nīgu
pŏṁta nadharāmṛtame pulum̐gālu
dŏṁtivĕṭṭi valabulu toḍam̐ dŏḍa nī kĕduru
siṁtadom̐ jūḍam̐ dŏḍam̐gĕ segŏnavayyā
(||tala||)
sikkani javvana midĕ siṁgārabum̐dom̐ṭa nīgu
pukkiḍivīḍelu vanabhojanālu
makkuvam̐ bānubumīm̐di māḍalapriyāladone
yĕkkuva viṁdulu sĕppī niyyagŏnavayyā
(||tala||)
yābĕgām̐gile nīgu nĕsam̐gam̐ bĕṁḍlisavigĕ
pūbam̐balugum̐ denĕle buvvālu
yebŏddu śhrīveṁkaḍeśha yĕnasi radula ninnu
tībulu puṭṭiṁchĕ nannīm̐ dĕlusugovayyā