Talamsugovaladaa taruni vinayamulu

తలఁచుకోవలదా తరుణి వినయములు
Language

(॥పల్లవి॥)
తలఁచుకోవలదా తరుణి వినయములు
పిలిపించుకొందురా ప్రేమగలచోటను

(॥తల॥)
కప్పురపువానలకమ్మవినోరఁ జెలియ
చెప్పరానిప్రియములు చెప్పెఁగా నీకు
తోప్పఁదోఁగె నోసలికస్తూరి బేఁటులు రాల
ముప్పరిగొన సారెకు మొక్కెఁగా నీకు

(॥తల॥)
గారవించి యాసతోడఁ గంకణాలచేతుల
గోరఁ జెక్కునొక్కి వేఁడుకోనెఁగా నిన్ను
కూరిమి నెందుకోకాని కుంకుమగుబ్బల నొత్తి
నేరుపుతోఁ గాఁగిట నించెఁగా నిన్ను

(॥తల॥)
సోయగపుఁగన్నుల సోలసిసోలసి చూచి
సేయరానిచెలుములు సేసెఁగా నీతో
యీయెడ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
ఆయమంటి కూడి ముదమందెఁగా నీతో

(||pallavi||)
talam̐sugovaladā taruṇi vinayamulu
pilibiṁchugŏṁdurā premagalasoḍanu

(||tala||)
kappurabuvānalagammavinoram̐ jĕliya
sĕpparānipriyamulu sĕppĕm̐gā nīgu
toppam̐dom̐gĕ nosaligastūri bem̐ṭulu rāla
mupparigŏna sārĕgu mŏkkĕm̐gā nīgu

(||tala||)
gāraviṁchi yāsadoḍam̐ gaṁkaṇālasedula
goram̐ jĕkkunŏkki vem̐ḍugonĕm̐gā ninnu
kūrimi nĕṁdugogāni kuṁkumagubbala nŏtti
nerubudom̐ gām̐giḍa niṁchĕm̐gā ninnu

(||tala||)
soyagabum̐gannula solasisolasi sūsi
seyarānisĕlumulu sesĕm̐gā nīdo
yīyĕḍa śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
āyamaṁṭi kūḍi mudamaṁdĕm̐gā nīdo