తలఁచుకొనఁగదే యాతనివల్ల నేరమేది
(॥పల్లవి॥)
తలఁచుకొనఁగదే యాతనివల్ల నేరమేది
యెలమిఁ దారుకాణలే ఇన్నియుఁ గావా
(॥తలఁ॥)
పచ్చిపోఁకఁగొని నీగుబ్బ లాతఁడు వేసెనంటా
కొచ్చికొచ్చినీవేల కోపగించేవే
ముచ్చటగా నీచన్నులు మొలచేయప్పటివేళ
అచ్చముగా నాపోఁకలంతేసివే కావా
(॥తలఁ॥)
తామరతూఁడున నీచెయి దాఁకించెనంటాను
వేమారు నాతని నెన్ని వెంగే లాడేవే
భూమిలో నీకరములు పోలించి చూచితేను
ఆమని తామరతూండ్ల అందములే కావా
(॥తలఁ॥)
తతి నీమెడ ముత్యాలదండ దగిలించెనంటా
మితిమీరినసిగ్గు లేమిటికె నీకు
అతఁడు శ్రీవేంకటేశుఁడల మేల్మంగవు నీవు
రతిచెమట ముత్యాలరాసులే కావా
(||pallavi||)
talam̐sugŏnam̐gade yādanivalla neramedi
yĕlamim̐ dārugāṇale inniyum̐ gāvā
(||talam̐||)
pachchibom̐kam̐gŏni nīgubba lādam̐ḍu vesĕnaṁṭā
kŏchchigŏchchinīvela kobagiṁcheve
muchchaḍagā nīsannulu mŏlaseyappaḍiveḽa
achchamugā nābom̐kalaṁtesive kāvā
(||talam̐||)
tāmaradūm̐ḍuna nīsĕyi dām̐kiṁchĕnaṁṭānu
vemāru nādani nĕnni vĕṁge lāḍeve
bhūmilo nīgaramulu poliṁchi sūsidenu
āmani tāmaradūṁḍla aṁdamule kāvā
(||talam̐||)
tadi nīmĕḍa mutyāladaṁḍa dagiliṁchĕnaṁṭā
midimīrinasiggu lemiḍigĕ nīgu
adam̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍala melmaṁgavu nīvu
radisĕmaḍa mutyālarāsule kāvā