Talamsugommanave taane nannunimtasese

తలఁచుకొమ్మనవే తానె నన్నునింతసేసె
Language

(॥పల్లవి॥)
తలఁచుకొమ్మనవే తానె నన్నునింతసేసె
వలప దిగవిడువ వసము గాదనరే (వే?)

(॥తల॥)
కన్నుల మొక్కేటి వారు కానుకలిచ్చేటివారు
యెన్నికసతులు దనకెందరు లేరు
నన్నువలెఁ దనమన్ననఁ బొంది దిక్కులను
వన్నె కెక్కఁ బేరుపడ్డవారు మరికలరా

(॥తల॥)
సేసలు వెట్టేటివారు చేతులు చాఁచేటివారు
యీ సరసములవారు యెందరు లేరు
దాసి యిట్టె నన్నువలెఁ దనపాదములు సోఁకి
రాసికెక్కినట్టివారు రాజ్యములోఁ గలరా

(॥తల॥)
మిక్కిలి సేవలవారు మించి నడచేటివారు
యెక్కడఁ జూచినఁ దనకెందరు లేరు
యెక్కువ శ్రీవేంకటేశుఁడిటు నావంటినీచుఁ
బక్కనఁగాచెను యిట్టి పరులూఁ గలరా

(||pallavi||)
talam̐sugŏmmanave tānĕ nannuniṁtasesĕ
valaba digaviḍuva vasamu gādanare (ve?)

(||tala||)
kannula mŏkkeḍi vāru kānugalichcheḍivāru
yĕnnigasadulu danagĕṁdaru leru
nannuvalĕm̐ danamannanam̐ bŏṁdi dikkulanu
vannĕ kĕkkam̐ berubaḍḍavāru marigalarā

(||tala||)
sesalu vĕṭṭeḍivāru sedulu sām̐seḍivāru
yī sarasamulavāru yĕṁdaru leru
dāsi yiṭṭĕ nannuvalĕm̐ danabādamulu som̐ki
rāsigĕkkinaṭṭivāru rājyamulom̐ galarā

(||tala||)
mikkili sevalavāru miṁchi naḍaseḍivāru
yĕkkaḍam̐ jūsinam̐ danagĕṁdaru leru
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ḍiḍu nāvaṁṭinīsum̐
bakkanam̐gāsĕnu yiṭṭi parulūm̐ galarā