Talamsugommanave taane naa gunamulu

తలఁచుకొమ్మనవె తానే నా గుణములు
Language

(॥పల్లవి॥)
తలఁచుకొమ్మనవె తానే నా గుణములు
వెలినేల లోనికిట్టే విచ్చేయు మనవే

(॥తలఁచు॥)
సముకానఁ దానిచ్చిన చనవులోదానఁ గాని
తమకించే కక్కసపుదానఁ గాను
రమణిపై వినోదాన రాసికెక్కేదానఁ గాని
అమరని వొడ్డారములాడేదానఁ గాను

(॥తలఁచు॥)
ననుపుతోఁ దానవ్వే నవ్వులలోదానఁగాని
తను నలయించే మంకుదానఁ గాను
వొనరి వుండ నేర్చిన వూడిగపుదానఁ గాని
పెనఁగి పెనఁగి సడిఁబెట్టేదానఁ గాను

(॥తలఁచు॥)
కలసి యిటులనుండే కాఁగిటిలోదానఁ గాని
తలుపుమాటున నుండేదానఁ గాను
యెలమి శ్రీవేంకటేశుఁడేలె నన్ను నింతలోనే
కలిమిలోదానఁ గాని కడదానఁ గాను

(||pallavi||)
talam̐sugŏmmanavĕ tāne nā guṇamulu
vĕlinela lonigiṭṭe vichcheyu manave

(||talam̐su||)
samugānam̐ dānichchina sanavulodānam̐ gāni
tamagiṁche kakkasabudānam̐ gānu
ramaṇibai vinodāna rāsigĕkkedānam̐ gāni
amarani vŏḍḍāramulāḍedānam̐ gānu

(||talam̐su||)
nanubudom̐ dānavve navvulalodānam̐gāni
tanu nalayiṁche maṁkudānam̐ gānu
vŏnari vuṁḍa nersina vūḍigabudānam̐ gāni
pĕnam̐gi pĕnam̐gi saḍim̐bĕṭṭedānam̐ gānu

(||talam̐su||)
kalasi yiḍulanuṁḍe kām̐giḍilodānam̐ gāni
talubumāḍuna nuṁḍedānam̐ gānu
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍelĕ nannu niṁtalone
kalimilodānam̐ gāni kaḍadānam̐ gānu