(॥పల్లవి॥)
తలఁచుకోఁడుగాక తన లాగులు
ఇల రెంట దెప్పరాన ఇతనౌనా వలపు
(॥తలఁ॥)
మనసేల రేఁచీనే మర్మమేల దాఁచీనే
చనుఁగవకేల చెయ్యి సారెఁ జాఁచీనే
మొనసి యొకతె నురమునఁ బెట్టుకొన్నాఁడు
ననిచి యాపెయినాను నగదా ఇందుకును
(॥తలఁ॥)
తరితీపేల సేసీవే తమి యేల మూసీనే
విరుల నేఁటికి నన్ను వేసీనే
శిరసుపై నొకతెను చేరి యెక్కించుకొన్నాడు
అరసి యాపెఇనా వెంగేలాడదా ఇందుకును
(॥తలఁ॥)
సన్నలనేల పొంచీనే చలమేల పెంచీనే
కన్నచోటనెల్లానేల గరిసించీనే
నన్ను శ్రీవేంకటేశుఁడు నమ్మించి బుజాన మోచె
చిన్నిగోలదైనా రట్టు సేయదా యిందుకును
(||pallavi||)
talam̐sugom̐ḍugāga tana lāgulu
ila rĕṁṭa dĕpparāna idanaunā valabu
(||talam̐||)
manasela rem̐sīne marmamela dām̐sīne
sanum̐gavagela sĕyyi sārĕm̐ jām̐sīne
mŏnasi yŏgadĕ nuramunam̐ bĕṭṭugŏnnām̐ḍu
nanisi yābĕyinānu nagadā iṁdugunu
(||talam̐||)
taridībela sesīve tami yela mūsīne
virula nem̐ṭigi nannu vesīne
śhirasubai nŏgadĕnu seri yĕkkiṁchugŏnnāḍu
arasi yābĕinā vĕṁgelāḍadā iṁdugunu
(||talam̐||)
sannalanela pŏṁchīne salamela pĕṁchīne
kannasoḍanĕllānela garisiṁchīne
nannu śhrīveṁkaḍeśhum̐ḍu nammiṁchi bujāna mosĕ
sinnigoladainā raṭṭu seyadā yiṁdugunu