తలఁచుకో యింకా నీవే తగవులన్నియు నేఁడు
(॥పల్లవి॥)
తలఁచుకో యింకా నీవే తగవులన్నియు నేఁడు
సిలుగులాఁడి సుద్దులు చెప్పలేము గాని
(॥తల॥)
చేతికిలోనైనసతి చెప్పించుకోదు ప్రియము
నీతియెఱిఁగిన దెందూ నేర మెంచదు
ఆతుమలో మెలఁగేది అవుఁగాములు చూడదు
యేతరికత్తెగుణాలే యెఱఁగముగాని
(॥తల॥)
ఇతవరియైన కాంత యెరవులు సేయదు
సతమైన దేమనినా చలపట్టదు
మతి నమ్మికై నది మర్మములు దడవదు
కతకారదానిమాయ కానలేముగాని
(॥తల॥)
తగులైనమానిని తరితీపు సేయదు
నగనేరిచినది యెన్నఁడు దిట్టదు
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
యెగసక్కెపు దానిజా డెట్టుండునో కాని
(||pallavi||)
talam̐sugo yiṁkā nīve tagavulanniyu nem̐ḍu
silugulām̐ḍi suddulu sĕppalemu gāni
(||tala||)
sedigilonainasadi sĕppiṁchugodu priyamu
nīdiyĕṟim̐gina dĕṁdū nera mĕṁchadu
ādumalo mĕlam̐gedi avum̐gāmulu sūḍadu
yedarigattĕguṇāle yĕṟam̐gamugāni
(||tala||)
idavariyaina kāṁta yĕravulu seyadu
sadamaina demaninā salabaṭṭadu
madi nammigai nadi marmamulu daḍavadu
kadagāradānimāya kānalemugāni
(||tala||)
tagulainamānini taridību seyadu
naganerisinadi yĕnnam̐ḍu diṭṭadu
agabaḍi śhrīveṁkaḍādhiba nannelidivi
yĕgasakkĕbu dānijā ḍĕṭṭuṁḍuno kāni