తలఁచుకో నీ మతికిఁ దారుకాణ యీ వలపు
(॥పల్లవి॥)
తలఁచుకో నీ మతికిఁ దారుకాణ యీ వలపు
తెలిపి చెప్పఁగఁబోతే తీగె సాగు వలపు
(॥తలఁ॥)
కావలెనన్నవారికి కడుఁ దీపు వలపు
వేవేలకు దాఁచుకొంటే వెలవెట్టు వలపు
చేవదేరఁ బెనఁగితే చిగిరించు వలపు
భావించి పోదిసేసితే పంటవండు వలపు
(॥తలఁ॥)
నేరుపుగలవారికి నిధానము వలపు
కూరిమిఁ జేకొంటేను కోటిసేసు వలపు
వూరకే తలపోసితే నువ్విళ్ళూరు వలపు
గారవించి తెచ్చుకొంటే గాదెనిండు వలపు
(॥తలఁ॥)
కైకొన్నవారికి కాణాచి వలపు
యేకడాఁ బాయకుండితే యీడేరు వలపు
దాకొని శ్రీవేంకటేశ తరుణిఁ గూడితి విట్టె
నీకూ నీపె కేకాలము నిండుకుండు వలపు
(||pallavi||)
talam̐sugo nī madigim̐ dārugāṇa yī valabu
tĕlibi sĕppam̐gam̐bode tīgĕ sāgu valabu
(||talam̐||)
kāvalĕnannavārigi kaḍum̐ dību valabu
vevelagu dām̐sugŏṁṭe vĕlavĕṭṭu valabu
sevaderam̐ bĕnam̐gide sigiriṁchu valabu
bhāviṁchi podiseside paṁṭavaṁḍu valabu
(||talam̐||)
nerubugalavārigi nidhānamu valabu
kūrimim̐ jegŏṁṭenu koḍisesu valabu
vūrage talaboside nuvviḽḽūru valabu
gāraviṁchi tĕchchugŏṁṭe gādĕniṁḍu valabu
(||talam̐||)
kaigŏnnavārigi kāṇāsi valabu
yegaḍām̐ bāyaguṁḍide yīḍeru valabu
dāgŏni śhrīveṁkaḍeśha taruṇim̐ gūḍidi viṭṭĕ
nīgū nībĕ kegālamu niṁḍuguṁḍu valabu