Talamsinavinniyum danagoragem velim

తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ
Language

(॥పల్లవి॥)
తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ
దెలియుట దనలోఁ దెలియుట కొరకే

(॥తలఁచి॥)
ఉదయమందుట భవముడుగుట కొరకే
చదువుట మేలువిచారించు కొరకే
బ్రదుకుట పురుషార్ధపరుఁడౌట కొరకే
యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే

(॥తలఁచి॥)
తగులుట విడివడఁదలఁచుట కొరకే
నొగులుట కర్మమునుభవించు కొరకే
చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే
బెగడుట దురితము పెడఁబాయు కొరకే

(॥తలఁచి॥)
యీవలఁ జేయుట ఆవలి కొరకే
ఆవలనుండుట యీవలఁ కొరకే
యీవలనావల నెనయఁ దిరుగుటెల్ల
శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే

(||pallavi||)
talam̐sinavinniyum̐ danagŏragem̐ vĕlim̐
dĕliyuḍa danalom̐ dĕliyuḍa kŏrage

(||talam̐si||)
udayamaṁduḍa bhavamuḍuguḍa kŏrage
saduvuḍa meluvisāriṁchu kŏrage
braduguḍa puruṣhārdhabarum̐ḍauḍa kŏrage
yĕdirim̐ ganuḍa tannĕṟum̐guḍa kŏrage

(||talam̐si||)
taguluḍa viḍivaḍam̐dalam̐suḍa kŏrage
nŏguluḍa karmamunubhaviṁchu kŏrage
sigurauḍa kŏmmayi sĕlam̐guḍa kŏrage
bĕgaḍuḍa duridamu pĕḍam̐bāyu kŏrage

(||talam̐si||)
yīvalam̐ jeyuḍa āvali kŏrage
āvalanuṁḍuḍa yīvalam̐ kŏrage
yīvalanāvala nĕnayam̐ diruguḍĕlla
śhrīveṁkaḍeśhvarum̐ jeruḍa kŏrage