Talamsina panulellaa taane ayyeemgaani

తలఁచిన పనులెల్లా తానే అయ్యీఁగాని
Language

(॥పల్లవి॥)
తలఁచిన పనులెల్లా తానే అయ్యీఁగాని
చలములు మాని మోవి చవిచూపరాదా

(॥తల॥)
వెంగలియలుకలేల విరహతాపము లేల
అంగనతో మంచిమాఁట లాడరాదా
ఇంగితమెఱిఁగి యాకె యెదురుగా వచ్చీని
ముంగిటికి విచ్చేసి మోము చూపరాదా

(॥తల॥)
అనురుసురననేల ఆరడిఁబడఁగనేల
ఇసుమంత పంతమునియ్యరాదా
సుసరాన నీతో నాకె సొలయుచు నవ్వీని
వెస నీవే ముందుగాను విడెమియ్యరాదా

(॥తల॥)
శిరసు వంచుకోనేల చెలుల నంపగఁనేల
సరుసఁగూచుండి చేయి చాఁచరాదా
గరిమ శ్రీవేంకటేశ కలసితి వాకె మెచ్చి
సరుగఁ జెక్కు లంటుచు సరసమాడరాదా

(||pallavi||)
talam̐sina panulĕllā tāne ayyīm̐gāni
salamulu māni movi savisūbarādā

(||tala||)
vĕṁgaliyalugalela virahadābamu lela
aṁganado maṁchimām̐ṭa lāḍarādā
iṁgidamĕṟim̐gi yāgĕ yĕdurugā vachchīni
muṁgiḍigi vichchesi momu sūbarādā

(||tala||)
anurusurananela āraḍim̐baḍam̐ganela
isumaṁta paṁtamuniyyarādā
susarāna nīdo nāgĕ sŏlayusu navvīni
vĕsa nīve muṁdugānu viḍĕmiyyarādā

(||tala||)
śhirasu vaṁchugonela sĕlula naṁpagam̐nela
sarusam̐gūsuṁḍi seyi sām̐sarādā
garima śhrīveṁkaḍeśha kalasidi vāgĕ mĕchchi
sarugam̐ jĕkku laṁṭusu sarasamāḍarādā