Talamsina panulella dakke neegunu

తలఁచిన పనులెల్ల దక్కె నీకును
Language

(॥పల్లవి॥)
తలఁచిన పనులెల్ల దక్కె నీకును
సిలుగులన్నియు మాని చెలఁరేగవయ్యా

(॥తలఁ॥)
ఆకె నీతో మాటలాడె అన్నియునుఁ దలకూడె
యేకచిత్తమున నుండు మిఁక నీవు
రాకుండఁగ నిందాఁక రవ్వగా నలిగితివి
యీకడ నీతొడ యెక్కె నిఁక నవ్వవయ్యా

(॥తలఁ॥)
యిదె నీపైఁ జేయివేసె ఇయ్యకములెల్లాఁ జేసె
యెద నిమురుకవుండు మిఁక నీవు
అదనఁ బిలువదంటా అసురుసురైతివి
చదురుల మాటలాడె చనవియ్యవయ్యా

(॥తలఁ॥)
నెయ్యమునఁ గాఁగిలించె నేరువుల మోవి యిచ్చె
యియ్యకోలు సేసుకొమ్మా యిఁక నీవు
పయ్యదంటి కొసరితి భామను శ్రీ వేంకటేశ
తియ్యఁగానే నిన్నుఁగూడె తిరముకోవయ్యా

(||pallavi||)
talam̐sina panulĕlla dakkĕ nīgunu
silugulanniyu māni sĕlam̐regavayyā

(||talam̐||)
āgĕ nīdo māḍalāḍĕ anniyunum̐ dalagūḍĕ
yegasittamuna nuṁḍu mim̐ka nīvu
rāguṁḍam̐ga niṁdām̐ka ravvagā naligidivi
yīgaḍa nīdŏḍa yĕkkĕ nim̐ka navvavayyā

(||talam̐||)
yidĕ nībaim̐ jeyivesĕ iyyagamulĕllām̐ jesĕ
yĕda nimurugavuṁḍu mim̐ka nīvu
adanam̐ biluvadaṁṭā asurusuraidivi
sadurula māḍalāḍĕ sanaviyyavayyā

(||talam̐||)
nĕyyamunam̐ gām̐giliṁchĕ neruvula movi yichchĕ
yiyyagolu sesugŏmmā yim̐ka nīvu
payyadaṁṭi kŏsaridi bhāmanu śhrī veṁkaḍeśha
tiyyam̐gāne ninnum̐gūḍĕ tiramugovayyā