తలఁచితే సిగ్గయ్యీ దగ్గరనున్నాఁ డతఁడు
(॥పల్లవి॥)
తలఁచితే సిగ్గయ్యీ దగ్గరనున్నాఁ డతఁడు
చెలులాల నాకు మీరు చెప్పరే బుద్దులు
(॥తలఁ॥)
వినయమే మేసితే వెగటైతోఁచదు గదా
ననిచి పాదాలోత్తితే నవ్వఁడుగదా
తనుఁ దప్పక చూచితే దంట యిదెనఁడుగదా
చెనకి పతికి నెట్టు సేవలు సేతువే
(॥తలఁ॥)
కదిసి కూచుండితేను గర్వమి దెనఁడు గదా
యెదుట నుండితే నెలయించడు గదా
అదనఁ దలవంచితే నట్టె పెనఁగడుగదా
పొదిగి యాతనితోడ పొందులెట్టుసేతునే
(॥తలఁ॥)
చెవల్లఁ గాఁగిలించితే సిగ్గులు రేఁచఁడు గదా
మోవెడిగితేఁ బల్లు మోపఁడు గదా
యావేళ శ్రీవేంకటేశుఁ డిందువచ్చి నన్నుఁ గూడె
యే వరుసల నితని నెంతని నే మెత్తునే
(||pallavi||)
talam̐side siggayyī daggaranunnām̐ ḍadam̐ḍu
sĕlulāla nāgu mīru sĕppare buddulu
(||talam̐||)
vinayame meside vĕgaḍaidom̐sadu gadā
nanisi pādālottide navvam̐ḍugadā
tanum̐ dappaga sūside daṁṭa yidĕnam̐ḍugadā
sĕnagi padigi nĕṭṭu sevalu seduve
(||talam̐||)
kadisi kūsuṁḍidenu garvami dĕnam̐ḍu gadā
yĕduḍa nuṁḍide nĕlayiṁchaḍu gadā
adanam̐ dalavaṁchide naṭṭĕ pĕnam̐gaḍugadā
pŏdigi yādanidoḍa pŏṁdulĕṭṭusedune
(||talam̐||)
sĕvallam̐ gām̐giliṁchide siggulu rem̐sam̐ḍu gadā
movĕḍigidem̐ ballu mobam̐ḍu gadā
yāveḽa śhrīveṁkaḍeśhum̐ ḍiṁduvachchi nannum̐ gūḍĕ
ye varusala nidani nĕṁtani ne mĕttune