తలఁచి యిటువంటివే తప్పించుకొనఁ బట్టె
(॥పల్లవి॥)
తలఁచి యిటువంటివే తప్పించుకొనఁ బట్టె
చెలులాల విభునికిఁ జేరి విన్నవించరే
(॥తలఁ॥)
వొగ్గి నేఁడు తా నాపె నొడివట్టఁగాఁ జూచితి
సిగ్గులు వడడుఁగదా చెలువుఁడు
అగ్గలమై ఇందుకుఁగా అట్టె తన్ను దూరితి
యెగ్గులు వట్టఁడుగదా ఇప్పు డితఁడు
(॥తలఁ॥)
యెనసి యిద్దరుండఁగా నింటిలోనికి వచ్చితి
మనసు నొవ్వదుగదా మరి తనకు
యెనలేని తమజాడ లెరుకలుచేసుకొంటి
వెనకతియ్యఁడుగదా వెఱపున నితఁడు
(॥తలఁ॥)
కచ్చు పెట్టి యాపె కూడిగము సేయఁగా వద్దంటి
మచ్చరించుకోఁడుగదా మగఁడు తాను
తచ్చీ శ్రీ వేంకటేశుఁడు తను నేఁ బెండ్లియాడితి
రచ్చలఁ బెట్టఁడుగదా రతులెల్లాను
(||pallavi||)
talam̐si yiḍuvaṁṭive tappiṁchugŏnam̐ baṭṭĕ
sĕlulāla vibhunigim̐ jeri vinnaviṁchare
(||talam̐||)
vŏggi nem̐ḍu tā nābĕ nŏḍivaṭṭam̐gām̐ jūsidi
siggulu vaḍaḍum̐gadā sĕluvum̐ḍu
aggalamai iṁdugum̐gā aṭṭĕ tannu dūridi
yĕggulu vaṭṭam̐ḍugadā ippu ḍidam̐ḍu
(||talam̐||)
yĕnasi yiddaruṁḍam̐gā niṁṭilonigi vachchidi
manasu nŏvvadugadā mari tanagu
yĕnaleni tamajāḍa lĕrugalusesugŏṁṭi
vĕnagadiyyam̐ḍugadā vĕṟabuna nidam̐ḍu
(||talam̐||)
kachchu pĕṭṭi yābĕ kūḍigamu seyam̐gā vaddaṁṭi
machchariṁchugom̐ḍugadā magam̐ḍu tānu
tachchī śhrī veṁkaḍeśhum̐ḍu tanu nem̐ bĕṁḍliyāḍidi
rachchalam̐ bĕṭṭam̐ḍugadā radulĕllānu