Talamsi sooda paradattvam bidamdu

తలఁచి చూడ పరతత్త్వం బితఁడు
Language

(॥పల్లవి॥)
తలఁచి చూడ పరతత్త్వం బితఁడు
వలసినవారికి వరదుఁ డితఁడు

(॥తలఁచి॥)
సిరికి మగఁ డమృతసింధువునకు నల్లుఁడు
సరుస పార్వతికి సయిదోడు
గరిమెల బ్రహ్మకుఁ గన్నతండ్రి యితఁడు
పరగి శివునకు బావ యితఁడు

(॥తలఁచి॥)
అల దేవేంద్రుని యనుజుఁ డితఁడు
మలసి చంద్రుని మఱఁ దితఁడు
కులమున నదితికి కొడుకూ నితఁడు
తలఁప సురాసురలతాతయు నితఁడు

(॥తలఁచి॥)
ప్రాణుల కెల్లా బంధుఁ డితఁడు
వాణికి మామగు వావి యితఁడు
జాణ శ్రీవేంకటాచలరమణుఁ డితఁడు
మాణికపు మన్మథుఁ డితఁడు

(||pallavi||)
talam̐si sūḍa paradattvaṁ bidam̐ḍu
valasinavārigi varadum̐ ḍidam̐ḍu

(||talam̐si||)
sirigi magam̐ ḍamṛtasiṁdhuvunagu nallum̐ḍu
sarusa pārvadigi sayidoḍu
garimĕla brahmagum̐ gannadaṁḍri yidam̐ḍu
paragi śhivunagu bāva yidam̐ḍu

(||talam̐si||)
ala deveṁdruni yanujum̐ ḍidam̐ḍu
malasi saṁdruni maṟam̐ didam̐ḍu
kulamuna nadidigi kŏḍugū nidam̐ḍu
talam̐pa surāsuraladādayu nidam̐ḍu

(||talam̐si||)
prāṇula kĕllā baṁdhum̐ ḍidam̐ḍu
vāṇigi māmagu vāvi yidam̐ḍu
jāṇa śhrīveṁkaḍāsalaramaṇum̐ ḍidam̐ḍu
māṇigabu manmathum̐ ḍidam̐ḍu