Talamsaraa deejaagu daggaree ramanum ditte

తలఁచరా దీజాగు దగ్గరీ రమణుఁ డిట్టె
Language

(॥పల్లవి॥)
తలఁచరా దీజాగు దగ్గరీ రమణుఁ డిట్టె
చెలులతోఁ జెప్పఁగానె సిగ్గువడీఁ జెలియ

(॥తల॥)
గుబ్బలపైఁ గప్పినట్టికోమలిపయ్యద నేఁడు
వుబ్బునఁ జల్లనిగాలి వొగిఁ దలఁగించఁగా
అబ్బురాన రమణుఁడు అది చూచి నవ్వితేను
జిబ్బిలుం జెమటతోడ సిగ్గువడీం తెలియ

(॥తల॥)
పడంతిపలిపము పైఁ బచ్చిగా వసంతుఁడు
వడియుఁ బూఁదేనెలవాన గురిఇంచఁగా
వెడభావములు చూచి విభుండు నవ్వితేను
చిడుముడి పాటుతోడ సిగ్గువఁడీ జెలియ

(॥తల॥)
ఇంతలో శ్రీవేంకటేశుఁ డింతిఁ గూడితే చిలుక
చెంతనే యద్దముగవిసెన చించఁగా
పంతమున నందు వీడ పతి చూచి నవ్వితేను
చింతదేరి తలవంచి సిగ్గువడీఁ జెలియ

(||pallavi||)
talam̐sarā dījāgu daggarī ramaṇum̐ ḍiṭṭĕ
sĕluladom̐ jĕppam̐gānĕ sigguvaḍīm̐ jĕliya

(||tala||)
gubbalabaim̐ gappinaṭṭigomalibayyada nem̐ḍu
vubbunam̐ jallanigāli vŏgim̐ dalam̐giṁcham̐gā
abburāna ramaṇum̐ḍu adi sūsi navvidenu
jibbiluṁ jĕmaḍadoḍa sigguvaḍīṁ tĕliya

(||tala||)
paḍaṁtibalibamu paim̐ bachchigā vasaṁtum̐ḍu
vaḍiyum̐ būm̐denĕlavāna guriiṁcham̐gā
vĕḍabhāvamulu sūsi vibhuṁḍu navvidenu
siḍumuḍi pāḍudoḍa sigguvam̐ḍī jĕliya

(||tala||)
iṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍiṁtim̐ gūḍide siluga
sĕṁtane yaddamugavisĕna siṁcham̐gā
paṁtamuna naṁdu vīḍa padi sūsi navvidenu
siṁtaderi talavaṁchi sigguvaḍīm̐ jĕliya