Talampulum dalampulu taarugaanalaaya nemdu

తలఁపులుఁ దలఁపులు తారుకాణలాయ నేఁడు
Language

(॥పల్లవి॥)
తలఁపులుఁ దలఁపులు తారుకాణలాయ నేఁడు
పలుమారు రతుల తెప్పలఁ దేలవమ్మా

(॥తలఁ॥)
సన్నసేసీ రమణుని సంగడిఁ గూచుండవమ్మా
కన్నులకలికి వో కప్పురగంది
చిన్నిమోవిఁ దేనెలూరఁ జేరి మాటలాడవమ్మా
చెన్నుమీర నిట్టె వో చిలుకలకొలికి

(॥తలఁ॥)
పక్కన నాతఁడు నవ్వీ భావించి చూడవమ్మా
చక్కని చంద్రవదన జవ్వాదివంకి
తక్కక నీకాఁగిటికిఁ దమకించి యున్నవాఁడు
పక్కఁ బండఁగదవమ్మా బంగారుబొమ్మా

(॥తలఁ॥)
చెలరేఁగి యాదరించీఁ జెలువునిఁ జూడవమ్మా
పులుపుమట్టెలరాణి కోకిలవాణి
యెలమి శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నిన్నుఁ గూడె
తలఁపు లీడేరెనమ్మా తలిరుఁబోఁడి

(||pallavi||)
talam̐pulum̐ dalam̐pulu tārugāṇalāya nem̐ḍu
palumāru radula tĕppalam̐ delavammā

(||talam̐||)
sannasesī ramaṇuni saṁgaḍim̐ gūsuṁḍavammā
kannulagaligi vo kappuragaṁdi
sinnimovim̐ denĕlūram̐ jeri māḍalāḍavammā
sĕnnumīra niṭṭĕ vo silugalagŏligi

(||talam̐||)
pakkana nādam̐ḍu navvī bhāviṁchi sūḍavammā
sakkani saṁdravadana javvādivaṁki
takkaga nīgām̐giḍigim̐ damagiṁchi yunnavām̐ḍu
pakkam̐ baṁḍam̐gadavammā baṁgārubŏmmā

(||talam̐||)
sĕlarem̐gi yādariṁchīm̐ jĕluvunim̐ jūḍavammā
pulubumaṭṭĕlarāṇi kogilavāṇi
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
talam̐pu līḍerĕnammā talirum̐bom̐ḍi