తలఁపులో విరహమో తరుణిపై మోహమో
(॥పల్లవి॥)
తలఁపులో విరహమో తరుణిపై మోహమో
చెలియ సింగారమెూ చెప్పరమ్మ చెలులూ
(॥తలఁప॥)
చిత్తరుపటముమీఁద జెలయనెమ్మోము వ్రాసి
గుత్తపుఁ జందురుఁ డని గుండె వగిలె
కొత్తగాఁ గ్రమ్మర నాకె కుచమండలము వ్రాసి
బిత్తరి జక్కవ లని ప్రియు డట్టే భ్రమసే
(॥తలఁప॥)
ప్రేమపురమణిమేఁటి పిఱుఁదు దానే వ్రాసి
కామునితే రనుచుఁ గలఁగ బారే
కాముకుఁడై పతి యింతికరపద్మములు వ్రాసి
ఆమనిజలజబాణా లని చూచి వెఱచె
(॥తలఁప॥)
అనుఁగుఁ దురుము వ్రాసి అలులంటా వెఱ గందే
ఘనుఁడయిన శ్రీవేంకటవిభుఁడు
వనిత నింతా వ్రాసి వనితకౌఁగిటిలోన
తనరూపు వ్రాసుకొని తాపమెల్లా నడఁచే
(||pallavi||)
talam̐pulo virahamo taruṇibai mohamo
sĕliya siṁgāramĕూ sĕpparamma sĕlulū
(||talam̐pa||)
sittarubaḍamumīm̐da jĕlayanĕmmomu vrāsi
guttabum̐ jaṁdurum̐ ḍani guṁḍĕ vagilĕ
kŏttagām̐ grammara nāgĕ kusamaṁḍalamu vrāsi
bittari jakkava lani priyu ḍaṭṭe bhramase
(||talam̐pa||)
premaburamaṇimem̐ṭi piṟum̐du dāne vrāsi
kāmunide ranusum̐ galam̐ga bāre
kāmugum̐ḍai padi yiṁtigarabadmamulu vrāsi
āmanijalajabāṇā lani sūsi vĕṟasĕ
(||talam̐pa||)
anum̐gum̐ durumu vrāsi alulaṁṭā vĕṟa gaṁde
ghanum̐ḍayina śhrīveṁkaḍavibhum̐ḍu
vanida niṁtā vrāsi vanidagaum̐giḍilona
tanarūbu vrāsugŏni tābamĕllā naḍam̐se