Talampulo korigalu daivaareeni

తలఁపులో కోరికలు దైవారీని
Language

(॥పల్లవి॥)
తలఁపులో కోరికలు దైవారీని
యెలమిఁ గానుక లిచ్చి యీడకు రమ్మనవే

(॥॥)
చెప్పరే యాతనిరాక చెలులాల
వుప్పతిల్లుఁ గాఁకలకు నోపనే నేను
కుప్పలుఁ దెప్పలునాయ కోరికలు
ఇప్పుడు కొలువులోఁ దా నేమిసేసినే

(॥॥)
చూపరే తనిమోము సుదతులాల
పైపై నాతమకము పట్టఁ గరాదు
మోపాయ జవ్వనము మొగి నామేన
యేపునఁ దనకు నన్ను నీడెర్చఁ దగును

(॥॥)
పొందుసేయరే యాతనిఁ బొలఁతులాల
విందువలెఁ దానె శ్రీవేంకటేశుఁడు
యిందుకే వచ్చి కలసె నిదివో నన్ను
అందమైన యిల్లాల నే నలమేలుమంగను

(||pallavi||)
talam̐pulo korigalu daivārīni
yĕlamim̐ gānuga lichchi yīḍagu rammanave

(||||)
sĕppare yādanirāga sĕlulāla
vuppadillum̐ gām̐kalagu nobane nenu
kuppalum̐ dĕppalunāya korigalu
ippuḍu kŏluvulom̐ dā nemisesine

(||||)
sūbare tanimomu sudadulāla
paibai nādamagamu paṭṭam̐ garādu
mobāya javvanamu mŏgi nāmena
yebunam̐ danagu nannu nīḍĕrsam̐ dagunu

(||||)
pŏṁduseyare yādanim̐ bŏlam̐tulāla
viṁduvalĕm̐ dānĕ śhrīveṁkaḍeśhum̐ḍu
yiṁduge vachchi kalasĕ nidivo nannu
aṁdamaina yillāla ne nalamelumaṁganu