తలఁపు దెలియవద్దా తా నెటువంటి జాణఁడే
(॥పల్లవి॥)
తలఁపు దెలియవద్దా తా నెటువంటి జాణఁడే
పిలిచే ననఁగానే ప్రియపడీఁ దాను
(॥తలఁప॥)
తెరలో నుండఁగా గుట్టు దెలుసుకొనుంటేను
తరకానివలె నేల తమకించీనే
దొరయంటాఁ దనకాలు దొక్కక వూరకే వుంటె
గొరబులు సేసి యేల కొసరీనే తాను
(॥తలఁప॥)
తప్పక చూడఁగాను తలవంచుకొంటేను
వుప్పతించి నను నేల వొడివట్టీనే
చెప్పరాని మాట గాఁగా సిగ్గువడి వుండితేను
అప్పటి నానవెట్టేల అడిగీనే తాను
(॥తలఁప॥)
బిగ్గెఁ గాఁగిలించుకోఁగా పెనఁగక వుంటేను
నిగ్గులఁ దానేల నాకు నేర్పవచ్చీనే
అగ్గమై శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నన్ను
వొగ్గి కూడె నిఁక నేల వొరసీనే తాను
(||pallavi||)
talam̐pu dĕliyavaddā tā nĕḍuvaṁṭi jāṇam̐ḍe
pilise nanam̐gāne priyabaḍīm̐ dānu
(||talam̐pa||)
tĕralo nuṁḍam̐gā guṭṭu dĕlusugŏnuṁṭenu
taragānivalĕ nela tamagiṁchīne
dŏrayaṁṭām̐ danagālu dŏkkaga vūrage vuṁṭĕ
gŏrabulu sesi yela kŏsarīne tānu
(||talam̐pa||)
tappaga sūḍam̐gānu talavaṁchugŏṁṭenu
vuppadiṁchi nanu nela vŏḍivaṭṭīne
sĕpparāni māḍa gām̐gā sigguvaḍi vuṁḍidenu
appaḍi nānavĕṭṭela aḍigīne tānu
(||talam̐pa||)
biggĕm̐ gām̐giliṁchugom̐gā pĕnam̐gaga vuṁṭenu
niggulam̐ dānela nāgu nerbavachchīne
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nannu
vŏggi kūḍĕ nim̐ka nela vŏrasīne tānu