Talampimchare selu laadanigi nidi

తలఁపించరే చెలు లాతనికి నిది
Language

(॥పల్లవి॥)
తలఁపించరే చెలు లాతనికి నిది
పలుక నేమున్నది తాఁ బనిగొంటగాక

(॥తల॥)
జిగిమించి విన్నపాలు సేయఁగనేర్తునా
తగ నన్ను మన్నించ తనకే పోదు
చిగురుఁజేతుల దన్నుఁ జెనకనేరుతునా
బిగివాయ కిలఁ దనభారమింతేకాక

(॥తల॥)
సొరిదిఁ దనకు నేఁ జుట్టమయేయదాననా
దరిచేర్చి బుద్దిచెప్పఁ దానేకాక
వరుసలఁ దనకు నే వలచేయంతదాననా
గరిమతో దానికీర్తి గట్టు కొనేఁ గాక

(॥తల॥)
పానుపుపైనుండి తన్నుఁ బైకొనఁగవచ్చునా
కానిమ్మని తానే నన్నుఁ గలసినాఁడు
అనుక శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
నానావిధాల నాతో నవ్వినాఁడుగాక

(||pallavi||)
talam̐piṁchare sĕlu lādanigi nidi
paluga nemunnadi tām̐ banigŏṁṭagāga

(||tala||)
jigimiṁchi vinnabālu seyam̐ganerdunā
taga nannu manniṁcha tanage podu
sigurum̐jedula dannum̐ jĕnaganerudunā
bigivāya kilam̐ danabhāramiṁtegāga

(||tala||)
sŏridim̐ danagu nem̐ juṭṭamayeyadānanā
darisersi buddisĕppam̐ dānegāga
varusalam̐ danagu ne valaseyaṁtadānanā
garimado dānigīrdi gaṭṭu kŏnem̐ gāga

(||tala||)
pānububainuṁḍi tannum̐ baigŏnam̐gavachchunā
kānimmani tāne nannum̐ galasinām̐ḍu
anuga śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
nānāvidhāla nādo navvinām̐ḍugāga