తలఁప వెనక నుయ్యి తగరు ముందట(?) దీనఁ
(॥పల్లవి॥)
తలఁప వెనక నుయ్యి తగరు ముందట(?) దీనఁ
దొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమి సేతు
(॥తలఁ॥)
మమకార విముక్తి మార్గదూరము నీపై
మమతసేయక నాకు మనరాదు
మమత మేలో నిర్మమత మేలో దీని-
క్రమమున క్రమము నేఁ గాన నేమి సేతు
(॥తలఁ॥)
కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని-
ష్కర్మము పాతకమునకుఁ దొడవు
కర్మిగావలెనో నిష్కర్మి గావలెనో యీ-
మర్మంపు మదము మాన దేమిసేతు
(॥తలఁ॥)
శరణాగత రక్షకుడవైనయట్టి
తిరువేంకటగిరిదేవుఁడా
పరిపూర్ణఁడవో నీవు పరిచ్ఛిన్నుఁడవో ని-
న్నరసి భజింపలేనైతి నేమిసేతు
(||pallavi||)
talam̐pa vĕnaga nuyyi tagaru muṁdaḍa(?) dīnam̐
dŏlam̐ga nāgum̐ dĕruvu dobam̐ demi sedu
(||talam̐||)
mamagāra vimukti mārgadūramu nībai
mamadaseyaga nāgu manarādu
mamada melo nirmamada melo dīni-
kramamuna kramamu nem̐ gāna nemi sedu
(||talam̐||)
karmamārgamu janmagadigim̐ jeruva ni-
ṣhkarmamu pādagamunagum̐ dŏḍavu
karmigāvalĕno niṣhkarmi gāvalĕno yī-
marmaṁpu madamu māna demisedu
(||talam̐||)
śharaṇāgada rakṣhaguḍavainayaṭṭi
tiruveṁkaḍagiridevum̐ḍā
paribūrṇam̐ḍavo nīvu parichchhinnum̐ḍavo ni-
nnarasi bhajiṁpalenaidi nemisedu