Talamela kulamela tabame kaaranamu

తలమేల కులమేల తపమే కారణము
Language

(॥పల్లవి॥)
తలమేల కులమేల తపమే కారణము
యెలమి హరిదాసులు యే జాతియైన నేమి

(॥తలమే॥)
కాకమువల్లఁ బుట్టదా ఘనమైన యశ్వత్ధము
దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము
చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము
యేకడ మహానుభావు లెందు పుట్టి రేమి

(॥తలమే॥)
బిడిపిరాళ్ళఁ బుట్టవా చెలువైన వజ్రములు
పుడమి నీఁగలవల్లఁ బుట్టదా తేనె
వెడఁగుఁ బిల్లి మేనను వెళ్లదాయెనా జవ్వాది
వుడివోని పుణ్యు లెందు నుదయించి రేమి

(॥తలమే॥)
పంకములోఁ బుట్టదా పరిమళపుఁ దామెర
పొంకపుఁ గీటకములందు పుట్టదా పట్టు
కొంకక శ్రీవేంకటేశుఁ గొలిచినదాసులు
సంకలేని జ్ఞాన లెందు జనియించి రేమి

(||pallavi||)
talamela kulamela tabame kāraṇamu
yĕlami haridāsulu ye jādiyaina nemi

(||talame||)
kāgamuvallam̐ buṭṭadā ghanamaina yaśhvatdhamu
dāgŏni gullalom̐ buṭṭadā muttĕmu
saugaina viṣhaladane janmiṁchadā nirviṣhamu
yegaḍa mahānubhāvu lĕṁdu puṭṭi remi

(||talame||)
biḍibirāḽḽam̐ buṭṭavā sĕluvaina vajramulu
puḍami nīm̐galavallam̐ buṭṭadā tenĕ
vĕḍam̐gum̐ billi menanu vĕḽladāyĕnā javvādi
vuḍivoni puṇyu lĕṁdu nudayiṁchi remi

(||talame||)
paṁkamulom̐ buṭṭadā parimaḽabum̐ dāmĕra
pŏṁkabum̐ gīḍagamulaṁdu puṭṭadā paṭṭu
kŏṁkaga śhrīveṁkaḍeśhum̐ gŏlisinadāsulu
saṁkaleni jñāna lĕṁdu janiyiṁchi remi