తలకొని యేల యెడతాఁకించేవు చెలులను
(॥పల్లవి॥)
తలకొని యేల యెడతాఁకించేవు చెలులను
వెలయ మీ సరితలు వింటా నుండేము
(॥తల॥)
సముకాననే నిన్ను జంకించి చూచేటి
రమణుల నేము మేరకుఁ దెచ్చేమా
తమకించి నీవె యాకతాన వేఁడుకొనవయ్య
తమితోడ నేము తెరదండ నుండేము
(॥తల॥)
బడిబడి నీతో నొడ్డాఁబట్టా మాటలాడేటి
పడఁతుల మేము వొడఁబరచేమా
తొడిఁబడ నీవే పొందులు చేసుకొనవయ్య
తడఁబడక మలఁగుదాపున నుండేము
(॥తల॥)
రతివేళ నిన్నుఁ గడురాపుగా నలయించేటి
అతివల నంతేసి కాదనఁగలమా
యితవై శ్రీవేంకటేశ యిట్టే నీవెనసితివి
మతిమఱవక నీమన్నన నుండేము
(||pallavi||)
talagŏni yela yĕḍadām̐kiṁchevu sĕlulanu
vĕlaya mī saridalu viṁṭā nuṁḍemu
(||tala||)
samugānane ninnu jaṁkiṁchi sūseḍi
ramaṇula nemu meragum̐ dĕchchemā
tamagiṁchi nīvĕ yāgadāna vem̐ḍugŏnavayya
tamidoḍa nemu tĕradaṁḍa nuṁḍemu
(||tala||)
baḍibaḍi nīdo nŏḍḍām̐baṭṭā māḍalāḍeḍi
paḍam̐tula memu vŏḍam̐barasemā
tŏḍim̐baḍa nīve pŏṁdulu sesugŏnavayya
taḍam̐baḍaga malam̐gudābuna nuṁḍemu
(||tala||)
radiveḽa ninnum̐ gaḍurābugā nalayiṁcheḍi
adivala naṁtesi kādanam̐galamā
yidavai śhrīveṁkaḍeśha yiṭṭe nīvĕnasidivi
madimaṟavaga nīmannana nuṁḍemu