తలపోసి తలపోసి తనువెల్లాఁ గాఁకరేఁగె
(॥పల్లవి॥)
తలపోసి తలపోసి తనువెల్లాఁ గాఁకరేఁగె
వలపు దరించరాదు వాములాయ నిపుడు
(॥॥)
యిట్టె విచ్చేయఁడొకొ యింతలో మరచెనొకొ
అట్టె పతి నఁనైనా రమ్మనఁడొకొ
గుట్టున నుందురునొకొ కొమ్మల నంపుదునొకొ
యెట్టు వేగించవచ్చు నింతవొద్దువోయను
(॥॥)
యింటిలో నున్నాఁడొకొ యెఱఁగలైనతినొకొ
నంటునఁ దా నింతసేసె నవ్వులకొకొ
అంటి చెలిచేతఁగానుకైనా నంపుదునొకొ
వొంటి నెట్టు దరియించే నోయమ్మ నేను
(॥॥)
మోము చూచి నవ్వఁడొక మొగి సన్నసేయఁడొకొ
కామించి తానే కాఁగిటఁ గలయఁడొకొ
యేమిరించి శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ గలసె
నామన సొకటే యాయ నమ్మితిఁబో ఇపుడు
(||pallavi||)
talabosi talabosi tanuvĕllām̐ gām̐karem̐gĕ
valabu dariṁcharādu vāmulāya nibuḍu
(||||)
yiṭṭĕ vichcheyam̐ḍŏgŏ yiṁtalo marasĕnŏgŏ
aṭṭĕ padi nam̐nainā rammanam̐ḍŏgŏ
guṭṭuna nuṁdurunŏgŏ kŏmmala naṁpudunŏgŏ
yĕṭṭu vegiṁchavachchu niṁtavŏdduvoyanu
(||||)
yiṁṭilo nunnām̐ḍŏgŏ yĕṟam̐galainadinŏgŏ
naṁṭunam̐ dā niṁtasesĕ navvulagŏgŏ
aṁṭi sĕlisedam̐gānugainā naṁpudunŏgŏ
vŏṁṭi nĕṭṭu dariyiṁche noyamma nenu
(||||)
momu sūsi navvam̐ḍŏga mŏgi sannaseyam̐ḍŏgŏ
kāmiṁchi tāne kām̐giḍam̐ galayam̐ḍŏgŏ
yemiriṁchi śhrī veṁkaḍeśhum̐ḍu nannum̐ galasĕ
nāmana sŏgaḍe yāya nammidim̐bo ibuḍu