Talabosi talabosi tamagimchee naamanasu

తలపోసి తలపోసి తమకించీ నామనసు
Language

(॥పల్లవి॥)
తలపోసి తలపోసి తమకించీ నామనసు
చెలులాల ఆతఁడేమి సేసీనొకో

(॥॥)
యెలయించినవాఁడు ఇంటికి రాఁడొకొ
చెలుల నంపితి మాఁట చేకొనెనొకా
కలువల వేసినాఁడు కరుణించకుండునొకొ
సొలసి చూచినవాఁడు చుట్టమై చిక్కఁడొకొ

(॥॥)
మచ్చికచల్లినవాఁడు మంతనములాడొఁకొ
ఇచ్చగించినాఁడు చనవియ్యఁడొకొ
కచ్చు పెట్టినవ్వేవాఁడు కప్పురవిడె మీఁడొకొ
వచ్చినవాఁడిఁకను నావద్దనే వుండీనొకొ

(॥॥)
వేడుక సేసినవాఁడు వీడుజోడై చొక్కఁడొకొ
వాడిచూపినవాఁడు వసమౌనొకొ
యీడనె శ్రీ వేంకటేశుఁడిన్నిటాను నన్ను నేల
కూడినవాఁడు నాబత్తి గొబ్బన మెచ్చునొకొ

(||pallavi||)
talabosi talabosi tamagiṁchī nāmanasu
sĕlulāla ādam̐ḍemi sesīnŏgo

(||||)
yĕlayiṁchinavām̐ḍu iṁṭigi rām̐ḍŏgŏ
sĕlula naṁpidi mām̐ṭa segŏnĕnŏgā
kaluvala vesinām̐ḍu karuṇiṁchaguṁḍunŏgŏ
sŏlasi sūsinavām̐ḍu suṭṭamai sikkam̐ḍŏgŏ

(||||)
machchigasallinavām̐ḍu maṁtanamulāḍŏm̐kŏ
ichchagiṁchinām̐ḍu sanaviyyam̐ḍŏgŏ
kachchu pĕṭṭinavvevām̐ḍu kappuraviḍĕ mīm̐ḍŏgŏ
vachchinavām̐ḍim̐kanu nāvaddane vuṁḍīnŏgŏ

(||||)
veḍuga sesinavām̐ḍu vīḍujoḍai sŏkkam̐ḍŏgŏ
vāḍisūbinavām̐ḍu vasamaunŏgŏ
yīḍanĕ śhrī veṁkaḍeśhum̐ḍinniḍānu nannu nela
kūḍinavām̐ḍu nābatti gŏbbana mĕchchunŏgŏ