Talabosi talabosi tamagimchee naamanasu

తలపోసి తలపోసి తమకించీ నామనసు
Language

(॥పల్లవి॥)
తలపోసి తలపోసి తమకించీ నామనసు
తలుపు దెఱచి నా దండకుఁ బిలువరే

(॥॥)
చెలి కత్తెల మాటలు చేకొని వినినవాఁ డు
యెలమి నిక్కడి కిప్పుడేల రాఁడే
కల కల నవ్వుతాను కానుక లందినవాఁడు
పలుమారు నెక్కడి పరాకున నున్నాఁడే

(॥॥)
ఆసవెట్టి నాకు లేక లంపినయట్టి వాఁడు
పాసి తా నక్కడ నేమిపని కున్నాఁడే
వాసి కెక్క నాపై వలపు చల్లనవాఁడు
సేస చేఁ బట్టుక యెంత సిగ్గుతో నున్నాఁడే

(॥॥)
పక్కన నా యండ వచ్చి పవళించి వున్నవాఁడు
మొక్కలాన నే లవ్వలిమోమై వున్నాఁడే
యిక్కడ శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
మిక్కిలి నన్నేలే యెట్టు మెచ్చుతా నున్నాఁడే

(||pallavi||)
talabosi talabosi tamagiṁchī nāmanasu
talubu dĕṟasi nā daṁḍagum̐ biluvare

(||||)
sĕli kattĕla māḍalu segŏni vininavām̐ ḍu
yĕlami nikkaḍi kippuḍela rām̐ḍe
kala kala navvudānu kānuga laṁdinavām̐ḍu
palumāru nĕkkaḍi parāguna nunnām̐ḍe

(||||)
āsavĕṭṭi nāgu lega laṁpinayaṭṭi vām̐ḍu
pāsi tā nakkaḍa nemibani kunnām̐ḍe
vāsi kĕkka nābai valabu sallanavām̐ḍu
sesa sem̐ baṭṭuga yĕṁta siggudo nunnām̐ḍe

(||||)
pakkana nā yaṁḍa vachchi pavaḽiṁchi vunnavām̐ḍu
mŏkkalāna ne lavvalimomai vunnām̐ḍe
yikkaḍa śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
mikkili nannele yĕṭṭu mĕchchudā nunnām̐ḍe