Talabosi soodaraadaa tanivi manasulo

తలపోసి చూడరాదా తనివి మనసులో
Language

(॥పల్లవి॥)
తలపోసి చూడరాదా తనివి మనసులో
పొలప వేడుకలెల్లాఁ బొదపౌనా నీకు

(॥తల॥)
యెందరు లేరు చుట్టాలు యెక్కడనైనా నీకు
విందులు గొల్లయిండ్ల వెన్నలెల్లాను
సందడింపు వలపులు చవిగావు నీకింత
పొందులు మాతోడివి పొసఁగీనా నీకు

(॥తల॥)
యింటింటివావులు యెన్నైనాఁ గలవు నీకు
తొంటినీ నెలవులే దొడ్డ లెల్లాను
పెంటపట్టు నగవులు పిప్పిగట్టు సారెసారె
అంటిముట్టి మాతో నవ్వులనువౌనా నీకు

(॥తల॥)
కొల్ల పెండ్లికూఁతులే గోపికలెల్లా నీకు
చల్ల జాణతనాలే రేపల్లె యల్లాను
యెల్లగా శ్రీవేంకటేశ యేలితివి మమ్మునిట్టె
పల్లుసోఁకు మాగురుతు బాగౌనా నీకు

(||pallavi||)
talabosi sūḍarādā tanivi manasulo
pŏlaba veḍugalĕllām̐ bŏdabaunā nīgu

(||tala||)
yĕṁdaru leru suṭṭālu yĕkkaḍanainā nīgu
viṁdulu gŏllayiṁḍla vĕnnalĕllānu
saṁdaḍiṁpu valabulu savigāvu nīgiṁta
pŏṁdulu mādoḍivi pŏsam̐gīnā nīgu

(||tala||)
yiṁṭiṁṭivāvulu yĕnnainām̐ galavu nīgu
tŏṁṭinī nĕlavule dŏḍḍa lĕllānu
pĕṁṭabaṭṭu nagavulu pippigaṭṭu sārĕsārĕ
aṁṭimuṭṭi mādo navvulanuvaunā nīgu

(||tala||)
kŏlla pĕṁḍligūm̐tule gobigalĕllā nīgu
salla jāṇadanāle reballĕ yallānu
yĕllagā śhrīveṁkaḍeśha yelidivi mammuniṭṭĕ
pallusom̐ku māgurudu bāgaunā nīgu