(॥పల్లవి॥)
తలపోఁతలే గనము తనివి లేదు
పిలిచేవా రెవ్వరే ప్రియుని నీడకును
(॥॥)
వెన్నవంటిదీ మనసు వేఁడివంటిదీ వలపు
యెన్నరాదు తమియైతే నేమి సేతునే
చన్నులును గొప్పలాయ జవ్వనము కడువీఁగు
విన్నవించేవా రెవ్వరే విభునితోనూ
(॥॥)
జిగురు వంటిది సిగ్గు జీడి వంటిది వేడుక
యిగిరించీఁ గోరికలు యేమి సేతునే
నిగిడీ నడియాసలు నిండీ నెదురుచూపులు
తగులెవ్వరు సేసేరే తగ నా కాతనికి
(॥॥)
పచ్చివంటిది కౌఁగిలి పండువంటిది కెమ్మోవి
హెచ్చెను నా చక్కఁదన మేమిసేతునే
యిచ్చ యెఱిఁగి శ్రీ వేంకటేశుఁడిందు వచ్చి కూడె
మెచ్చే వారిఁక నెవ్వరే మే మిట్టే వుండఁగనూ
(||pallavi||)
talabom̐tale ganamu tanivi ledu
pilisevā rĕvvare priyuni nīḍagunu
(||||)
vĕnnavaṁṭidī manasu vem̐ḍivaṁṭidī valabu
yĕnnarādu tamiyaide nemi sedune
sannulunu gŏppalāya javvanamu kaḍuvīm̐gu
vinnaviṁchevā rĕvvare vibhunidonū
(||||)
jiguru vaṁṭidi siggu jīḍi vaṁṭidi veḍuga
yigiriṁchīm̐ gorigalu yemi sedune
nigiḍī naḍiyāsalu niṁḍī nĕdurusūbulu
tagulĕvvaru sesere taga nā kādanigi
(||||)
pachchivaṁṭidi kaum̐gili paṁḍuvaṁṭidi kĕmmovi
hĕchchĕnu nā sakkam̐dana memisedune
yichcha yĕṟim̐gi śhrī veṁkaḍeśhum̐ḍiṁdu vachchi kūḍĕ
mĕchche vārim̐ka nĕvvare me miṭṭe vuṁḍam̐ganū