తలపోఁతలనే నాకు తడఁబడీ వేడుకలు
(॥పల్లవి॥)
తలపోఁతలనే నాకు తడఁబడీ వేడుకలు
చెలులాల యేమి సేతు చిమ్మి రేఁగీ మనసు
(॥॥)
చిత్తము రా మాటలాడి చెంగలించఁ జేసీ కడు
బత్తి చూపే దెన్నఁ డొకో పతికి నేను
గుత్తపు గుబ్బల నూఁది కొనగోరు సోఁకఁ బాదా
లొత్తే దిక నెన్నఁ డొకో వుమ్మగిలీ మన
(॥॥)
కళ లెల్లా రేఁగఁ దన్ను కౌఁగిలించి పట్టు కొని
వలపించే దెన్నఁ డొకో వాని నేను
మొలక నవ్వులు నవ్వి ముప్పిరిఁ జూపులు నాఁటఁ
దిలకించే దెన్నఁ డొకో తిమిరీ నామనసు
(॥॥)
చెమటలు జొబ్బిలించి సిగ్గుదేర రతిఁ గూడి
తమి రేఁచే దెన్నఁడొకో తనకు నేను
సమ గతి శ్రీ వేంకటేశ్వరుఁడు వచ్చి నన్నేలె
అమరె నెన్నఁడొకో అరుదందీ మనసు
(||pallavi||)
talabom̐talane nāgu taḍam̐baḍī veḍugalu
sĕlulāla yemi sedu simmi rem̐gī manasu
(||||)
sittamu rā māḍalāḍi sĕṁgaliṁcham̐ jesī kaḍu
batti sūbe dĕnnam̐ ḍŏgo padigi nenu
guttabu gubbala nūm̐di kŏnagoru som̐kam̐ bādā
lŏtte diga nĕnnam̐ ḍŏgo vummagilī mana
(||||)
kaḽa lĕllā rem̐gam̐ dannu kaum̐giliṁchi paṭṭu kŏni
valabiṁche dĕnnam̐ ḍŏgo vāni nenu
mŏlaga navvulu navvi muppirim̐ jūbulu nām̐ṭam̐
dilagiṁche dĕnnam̐ ḍŏgo timirī nāmanasu
(||||)
sĕmaḍalu jŏbbiliṁchi siggudera radim̐ gūḍi
tami rem̐se dĕnnam̐ḍŏgo tanagu nenu
sama gadi śhrī veṁkaḍeśhvarum̐ḍu vachchi nannelĕ
amarĕ nĕnnam̐ḍŏgo arudaṁdī manasu