Talabomta baamte talampulagum dama

తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమ
Language

(॥పల్లవి॥)
తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమ-
కొలఁ దెఱంగనిమతి గోడాడఁగా

(॥తల॥)
ఆపదలు బాఁతె అందరికినిఁ దమ-
చాపలపు సంపదలు సడిఁబెట్టఁగా
పాపములు బాఁతె ప్రాణులకును మతిఁ
బాపరానియాస దమ్ముఁ బాధించఁగా

(॥తల॥)
జగడాలు బాఁతె జనులకునుఁ దమ-
పగలైనకోపాలు పై కొనఁగా
వగలు బాఁతె వలలఁ బెట్టెడి తమ్ముఁ
దగిలించు మమత వేదనము సేయఁగా

(॥తల॥)
భయములు బాఁతె పరులకును తమ-
దయలేక అలయించు ధనముండఁగా
జయములు బాఁతె సతతమును యింత-
నయగారివేంకటనాథుఁ డుండఁగాను

(||pallavi||)
talabom̐ta bām̐tĕ talam̐pulagum̐ dama-
kŏlam̐ dĕṟaṁganimadi goḍāḍam̐gā

(||tala||)
ābadalu bām̐tĕ aṁdariginim̐ dama-
sābalabu saṁpadalu saḍim̐bĕṭṭam̐gā
pābamulu bām̐tĕ prāṇulagunu madim̐
bābarāniyāsa dammum̐ bādhiṁcham̐gā

(||tala||)
jagaḍālu bām̐tĕ janulagunum̐ dama-
pagalainagobālu pai kŏnam̐gā
vagalu bām̐tĕ valalam̐ bĕṭṭĕḍi tammum̐
dagiliṁchu mamada vedanamu seyam̐gā

(||tala||)
bhayamulu bām̐tĕ parulagunu tama-
dayalega alayiṁchu dhanamuṁḍam̐gā
jayamulu bām̐tĕ sadatamunu yiṁta-
nayagāriveṁkaḍanāthum̐ ḍuṁḍam̐gānu