Talabimcha kimka nadi dari serenu

తలపించ కింక నది దరి చేరేను
Language

(॥పల్లవి॥)
తలపించ కింక నది దరి చేరేను
కల గన్నట్లనాయ కాఁక లేల చాలురా

(॥॥)
చెక్కు నొక్కి వేఁడుకోఁగా జేరి యన్ని మరచితి
వొక్కడై నీవు సేసేది వోర్చ వచ్చునా
పుక్కిలి బంటియ్య నీతో పొందులమాటలు నాకు
పిక్కటిల్లె వలపులు పెక్కు లేల చాలురా

(॥॥)
పంత మిచ్చి నవ్వించఁగఁ బరిణమించుకొంటివి
యెంత లేదు నీసుద్దులు యెంచ వచ్చునా
దొంతులై యిల్లెల్ల నిండె దొమ్మి నీయాసలు నాకు
సంతకెక్కె నివి సాలు సరసాలు చాలురా

(॥॥)
కౌఁగిలించి కూడఁగాను కన్నులనే తనిసితి
చేగ దేరె నీ మన్నన చెప్ప వసమా
ఆఁగకు శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
నాఁగువారి వేడుకలు నటనలు చాలురా.

(||pallavi||)
talabiṁcha kiṁka nadi dari serenu
kala gannaṭlanāya kām̐ka lela sālurā

(||||)
sĕkku nŏkki vem̐ḍugom̐gā jeri yanni marasidi
vŏkkaḍai nīvu sesedi vorsa vachchunā
pukkili baṁṭiyya nīdo pŏṁdulamāḍalu nāgu
pikkaḍillĕ valabulu pĕkku lela sālurā

(||||)
paṁta michchi navviṁcham̐gam̐ bariṇamiṁchugŏṁṭivi
yĕṁta ledu nīsuddulu yĕṁcha vachchunā
dŏṁtulai yillĕlla niṁḍĕ dŏmmi nīyāsalu nāgu
saṁtagĕkkĕ nivi sālu sarasālu sālurā

(||||)
kaum̐giliṁchi kūḍam̐gānu kannulane tanisidi
sega derĕ nī mannana sĕppa vasamā
ām̐gagu śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
nām̐guvāri veḍugalu naḍanalu sālurā.