తల వంచుకొననేలే దండ నున్నాడు విభుఁడు
(॥పల్లవి॥)
తల వంచుకొననేలే దండ నున్నాడు విభుఁడు
లలి వెనకటి సేఁతలకు నింత సేతురా
(॥తల॥)
చలము సాదించరాదు సరస మాడేయప్పుడు
వలపులు రేఁచి నవ్వవలెఁగాని
అలుగఁ దగదు మరి ఆయము గోర నంటితే
పిలిచి సమరతులఁ బెనఁగఁగవలెను
(॥తల॥)
వేడుకపడేవేళ వెంగెములాడఁగ రాదు
వాడిక నిచ్చక మాడవలెఁ గాని
పాడి పంతా లెంచ రాదు పక్కన వేఁడుకొనఁగా
వీడె మిచ్చి కప్పురాన వేయవలెఁ గాని
(॥తల॥)
పగటులు చూపరాదు పానుపుపై నుండఁగాను
వగవగరుగాఁ గూడవలెఁ గాని
బిగియఁగఁ బనిలేదు ప్రియము లొనగూడితే
తగిలి శ్రీవేంకటేశు దక్కఁ గొనవలెను
(||pallavi||)
tala vaṁchugŏnanele daṁḍa nunnāḍu vibhum̐ḍu
lali vĕnagaḍi sem̐talagu niṁta sedurā
(||tala||)
salamu sādiṁcharādu sarasa māḍeyappuḍu
valabulu rem̐si navvavalĕm̐gāni
alugam̐ dagadu mari āyamu gora naṁṭide
pilisi samaradulam̐ bĕnam̐gam̐gavalĕnu
(||tala||)
veḍugabaḍeveḽa vĕṁgĕmulāḍam̐ga rādu
vāḍiga nichchaga māḍavalĕm̐ gāni
pāḍi paṁtā lĕṁcha rādu pakkana vem̐ḍugŏnam̐gā
vīḍĕ michchi kappurāna veyavalĕm̐ gāni
(||tala||)
pagaḍulu sūbarādu pānububai nuṁḍam̐gānu
vagavagarugām̐ gūḍavalĕm̐ gāni
bigiyam̐gam̐ baniledu priyamu lŏnagūḍide
tagili śhrīveṁkaḍeśhu dakkam̐ gŏnavalĕnu