తల పొకటియు నా చేఁతయు వేరొకటియాయ
(॥పల్లవి॥)
తల పొకటియు నా చేఁతయు వేరొకటియాయ
సొలసి యెగ్గులెంచేవు సుమ్మీ వో విభుఁడా
(॥తల॥)
సొలసినచూపుననుఁ జూచేపరాకున
తొలుత నాపలుకులే దూరీ నిన్ను
తెలిసి నీరూపు చింతించేపరాకున
వలనైనకాల నేల వ్రాసీ నీపేరు
(॥తల॥)
బడి నీసుద్దులు వినేపరాకున నీవు రాఁగా
జడియునాతనువు మంచము దిగదు
కడువిరహపువెదఁ గాఁగేపరాకున
సిడిసి కన్నీరు నీపైఁ జిమ్మీ నాగోరు
(॥తల॥)
పచ్చిగాఁ గూడేటి నిబ్బరపుఁ బరాకున
గచ్చునాకుచాలు నిన్నుఁ గాఁడివారీని
మచ్చిక శ్రీవేంకటేశ మర్మపుఁబరాకున
యిచ్చ నాచెమట నిన్ను నీఁదులాడించీని
(||pallavi||)
tala pŏgaḍiyu nā sem̐tayu verŏgaḍiyāya
sŏlasi yĕggulĕṁchevu summī vo vibhum̐ḍā
(||tala||)
sŏlasinasūbunanum̐ jūsebarāguna
tŏluda nābalugule dūrī ninnu
tĕlisi nīrūbu siṁtiṁchebarāguna
valanainagāla nela vrāsī nīberu
(||tala||)
baḍi nīsuddulu vinebarāguna nīvu rām̐gā
jaḍiyunādanuvu maṁchamu digadu
kaḍuvirahabuvĕdam̐ gām̐gebarāguna
siḍisi kannīru nībaim̐ jimmī nāgoru
(||tala||)
pachchigām̐ gūḍeḍi nibbarabum̐ barāguna
gachchunāgusālu ninnum̐ gām̐ḍivārīni
machchiga śhrīveṁkaḍeśha marmabum̐barāguna
yichcha nāsĕmaḍa ninnu nīm̐dulāḍiṁchīni