తల మొలా నొక్కసరా తను వొక్కటౌఁ గాక
(॥పల్లవి॥)
తల మొలా నొక్కసరా తను వొక్కటౌఁ గాక
కొలఁది యెరిఁ గతనిఁ గొలువరో మీరు
(॥తల॥)
బొడ్డున బ్రహ్మఁ గనిన పురాణపురుషుఁడే
దొడ్డుఁ గాక ఆతని తోడివాఁడ(డా?)
వొడ్డిన కైలాసమే లేవు మాపతిఁ గడుపులో
వెడ్డువెట్టి పెంచేవాఁడు వీరితోవాఁడా
(॥తల॥)
చక్కని కన్నుల సూర్యచంద్రులుగాఁ గలవాఁడు
యెక్కుడుగా కిందరిలో నీడువెట్టేదా
అక్కర యీ దేవతల కాపద మానిపేవాఁడు
వెక్కసమే కాక యెంచ వీరిలోనే వొకఁడా
(॥తల॥)
అందరు నీతనియందే అయితే నౌదురుఁ గాక
యెందును శ్రీపతి తోడియీడువారా
కందువ శ్రీవేంకటాద్రి ఘనవరము లొసఁగె
దిందుపడ్డ లోకులకు ద్రిష్టమిదే కాదా
(||pallavi||)
tala mŏlā nŏkkasarā tanu vŏkkaḍaum̐ gāga
kŏlam̐di yĕrim̐ gadanim̐ gŏluvaro mīru
(||tala||)
bŏḍḍuna brahmam̐ ganina purāṇaburuṣhum̐ḍe
dŏḍḍum̐ gāga ādani toḍivām̐ḍa(ḍā?)
vŏḍḍina kailāsame levu mābadim̐ gaḍubulo
vĕḍḍuvĕṭṭi pĕṁchevām̐ḍu vīridovām̐ḍā
(||tala||)
sakkani kannula sūryasaṁdrulugām̐ galavām̐ḍu
yĕkkuḍugā kiṁdarilo nīḍuvĕṭṭedā
akkara yī devadala kābada mānibevām̐ḍu
vĕkkasame kāga yĕṁcha vīrilone vŏgam̐ḍā
(||tala||)
aṁdaru nīdaniyaṁde ayide naudurum̐ gāga
yĕṁdunu śhrībadi toḍiyīḍuvārā
kaṁduva śhrīveṁkaḍādri ghanavaramu lŏsam̐gĕ
diṁdubaḍḍa logulagu driṣhṭamide kādā