Tala dadisidene sali vaasha(se) namduru

తల దడిసితేనే చలి వాశ(సె) నందురు
Language

(॥పల్లవి॥)
తల దడిసితేనే చలి వాశ(సె) నందురు
చెలఁగి యేమనినాను సిగ్గులు వడేరా

(॥తల॥)
ఏకత మాడినవారు యెనయెక మానేరా
జోకతో వారిపొందులు సోదించ నేలే
మేకొని నవ్వినవారు మేలము లాడకుండేరా
ఆకొలఁది నాసుద్దులు యడుగగవలెనా

(॥తల॥)
వీడె మందుకొన్నవారు వేడుక పడకుండేరా
ఆడనీడ వారికత లరయ నేలే
వాడికె చెంతలవారు వలవక మానేరా
జోడైనతారుకాణలు చూపఁగలవలెనా

(॥తల॥)
పరపు పైన నున్నవారు పరాకులు సేసేరా
తిరుగ వారిగుణాలు తెలియ నేలే
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
పరగ నీరెండూ నేరుపరచఁగవలెనా

(||pallavi||)
tala daḍisidene sali vāśha(sĕ) naṁduru
sĕlam̐gi yemaninānu siggulu vaḍerā

(||tala||)
egada māḍinavāru yĕnayĕga mānerā
jogado vāribŏṁdulu sodiṁcha nele
megŏni navvinavāru melamu lāḍaguṁḍerā
āgŏlam̐di nāsuddulu yaḍugagavalĕnā

(||tala||)
vīḍĕ maṁdugŏnnavāru veḍuga paḍaguṁḍerā
āḍanīḍa vārigada laraya nele
vāḍigĕ sĕṁtalavāru valavaga mānerā
joḍainadārugāṇalu sūbam̐galavalĕnā

(||tala||)
parabu paina nunnavāru parāgulu seserā
tiruga vāriguṇālu tĕliya nele
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
paraga nīrĕṁḍū nerubarasam̐gavalĕnā