Takkulu mokkulu tagulaaya

తక్కులు మొక్కులు తగులాయ
Language

(॥పల్లవి॥)
తక్కులు మొక్కులు తగులాయ
దిక్కుల మోహము ద్రిష్టములాయ

(॥తక్కు॥)
కాంతమేను కడుఁగాఁకలఁ బొరలఁగ
చెంతలఁ జెక్కులు చెమరించె
వంతుల నెండయు వానయు నొక్కట
దొంతులఁ గూడిన తోయములాయ

(॥తక్కు॥)
తెలినిట్టచూపు దీపాలు గలుగఁగ
కలికితురుముచీఁకటి నెరసె
వెలసిన చీఁకటి వెలుఁగును నొక్కట
కలిగినభావము కతలై నిలిచె

(॥తక్కు॥)
పూవులపులకలు పొడిమినవేళ
మోవులపండు ముదిరె నదె
శ్రీవేంకటపతి చేరి కూడఁగ
వావులరతు లేవంబులు గాచె

(||pallavi||)
takkulu mŏkkulu tagulāya
dikkula mohamu driṣhṭamulāya

(||takku||)
kāṁtamenu kaḍum̐gām̐kalam̐ bŏralam̐ga
sĕṁtalam̐ jĕkkulu sĕmariṁchĕ
vaṁtula nĕṁḍayu vānayu nŏkkaḍa
dŏṁtulam̐ gūḍina toyamulāya

(||takku||)
tĕliniṭṭasūbu dībālu galugam̐ga
kaligidurumusīm̐kaḍi nĕrasĕ
vĕlasina sīm̐kaḍi vĕlum̐gunu nŏkkaḍa
kaliginabhāvamu kadalai nilisĕ

(||takku||)
pūvulabulagalu pŏḍiminaveḽa
movulabaṁḍu mudirĕ nadĕ
śhrīveṁkaḍabadi seri kūḍam̐ga
vāvularadu levaṁbulu gāsĕ