Takkinavaarigellaam darideebu lamduru

తక్కినవారికెల్లాఁ దరితీపు లందురు
Language

(॥పల్లవి॥)
తక్కినవారికెల్లాఁ దరితీపు లందురు
మిక్కుటపు సరసము మీలో నమరును

(॥తక్కి॥)
తగునమ్మ యిన్నిటాను తరుణి నీకాతనికి
నగవమ్మ యాతనితో ననువునను
జిగి మీరొక్కరొకరు సేసినట్టెల్లాఁజెల్లె
మిగులా మీవొద్దికలు మీలో నమరును

(॥తక్కి॥)
కూడెనమ్మ సంసారము కోమలి మీయిద్దరికి
చూడవమ్మ అతనిపై సొలపుఁజూపు
తోడునీడలవలెను దొరకె మీవయసులు
మేడుపుమీరతులివి మీలో నమరును

(॥తక్కి॥)
పండెనమ్మ వలపులు పడఁతి మీకొర్కులకు
వుండవమ్మ యీతనివొద్దనే నీవు
అండనే శ్రీవేంకటేశునంకెలే నీయంకెలాయ
మెండగుమీకూటములు మీలో నమరును

(||pallavi||)
takkinavārigĕllām̐ daridību laṁduru
mikkuḍabu sarasamu mīlo namarunu

(||takki||)
tagunamma yinniḍānu taruṇi nīgādanigi
nagavamma yādanido nanuvunanu
jigi mīrŏkkarŏgaru sesinaṭṭĕllām̐jĕllĕ
migulā mīvŏddigalu mīlo namarunu

(||takki||)
kūḍĕnamma saṁsāramu komali mīyiddarigi
sūḍavamma adanibai sŏlabum̐jūbu
toḍunīḍalavalĕnu dŏragĕ mīvayasulu
meḍubumīradulivi mīlo namarunu

(||takki||)
paṁḍĕnamma valabulu paḍam̐ti mīgŏrgulagu
vuṁḍavamma yīdanivŏddane nīvu
aṁḍane śhrīveṁkaḍeśhunaṁkĕle nīyaṁkĕlāya
mĕṁḍagumīgūḍamulu mīlo namarunu