Takkinavaari kimta tagunaa nemdu

తక్కినవారి కింత తగునా నేఁడు
Language

(॥పల్లవి॥)
తక్కినవారి కింత తగునా నేఁడు
వెక్కా(క్క?)సి గనక నిన్ను వేమారు దూరీని

(॥తక్కి॥)
సలిగెగద్దు గన సతి నీతో మారుకొని
మలసి వొడ్డాఁ బెట్టా మాఁటలాడీని
బలిమికత్తెగనక పైకొని పెనఁగి నీవు
తలకొని చెనకఁగా దప్పించుకొనీని

(॥తక్కి॥)
మనసెఱుఁగుఁగనక మగువ మర్మములెత్తి
కనుసన్నలనె తిట్టి గద్దీంచ్చీని
మునుపటాలుగనక మొగిఁజన్నులంటితేను
వొనర సిగ్గున నీకు నొట్లువెట్టీని

(॥తక్కి॥)
బాసగొన్నదిగనక బడి నలమేలుమంగ
ఆసలిచ్చి రతిఁగూడి అలయించీని
సేసవెట్టితివి నాకు శ్రీవేంకటేశ్వర
వొసరించ కప్పటి నీవురముపై నిక్కీని

(||pallavi||)
takkinavāri kiṁta tagunā nem̐ḍu
vĕkkā(kka?)si ganaga ninnu vemāru dūrīni

(||takki||)
saligĕgaddu gana sadi nīdo mārugŏni
malasi vŏḍḍām̐ bĕṭṭā mām̐ṭalāḍīni
balimigattĕganaga paigŏni pĕnam̐gi nīvu
talagŏni sĕnagam̐gā dappiṁchugŏnīni

(||takki||)
manasĕṟum̐gum̐ganaga maguva marmamulĕtti
kanusannalanĕ tiṭṭi gaddīṁchchīni
munubaḍāluganaga mŏgim̐jannulaṁṭidenu
vŏnara sigguna nīgu nŏṭluvĕṭṭīni

(||takki||)
bāsagŏnnadiganaga baḍi nalamelumaṁga
āsalichchi radim̐gūḍi alayiṁchīni
sesavĕṭṭidivi nāgu śhrīveṁkaḍeśhvara
vŏsariṁcha kappaḍi nīvuramubai nikkīni