Takkina vellaam dahadahale

తక్కిన వెల్లాఁ దహతహలే
Language

(॥పల్లవి॥)
తక్కిన వెల్లాఁ దహతహలే
నిక్కపు శ్రీహరి నిజమగు తెలివీ

(॥తక్కిన॥)
ధరణి సమస్తము దైవాధీనము
పోరిఁ బ్రాణుల నేర్పులఁ బడవు
వరుసఁ దమంతనే వచ్చిన వెల్లా
హరికరుణని ముద మందుట తెలివీ

(॥తక్కిన॥)
కావలసినపని కర్మాధీనము
వావిరి నది గడవఁగ రాదు
దావతి కుడువక తప్పులఁ బొరలక
భావము సంతస పఱచుట తెలివీ

(॥తక్కిన॥)
పుట్టిన తనువులు భోగాధీనము
లట్డిట్టని తెలియఁగ రాదు
గట్టిగ శ్రీవేంకటపతి నేవే
నెట్టన నమ్ముట నిజమగు తెలివీ

(||pallavi||)
takkina vĕllām̐ dahadahale
nikkabu śhrīhari nijamagu tĕlivī

(||takkina||)
dharaṇi samastamu daivādhīnamu
porim̐ brāṇula nerbulam̐ baḍavu
varusam̐ damaṁtane vachchina vĕllā
harigaruṇani muda maṁduḍa tĕlivī

(||takkina||)
kāvalasinabani karmādhīnamu
vāviri nadi gaḍavam̐ga rādu
dāvadi kuḍuvaga tappulam̐ bŏralaga
bhāvamu saṁtasa paṟasuḍa tĕlivī

(||takkina||)
puṭṭina tanuvulu bhogādhīnamu
laṭḍiṭṭani tĕliyam̐ga rādu
gaṭṭiga śhrīveṁkaḍabadi neve
nĕṭṭana nammuḍa nijamagu tĕlivī