Takkina suddulu tadava mimka

తక్కిన సుద్దులు తడవ మిఁక
Language

(॥పల్లవి॥)
తక్కిన సుద్దులు తడవ మిఁక
చొక్కులఁ బెట్టుచు సొలయకువయ్యా

(॥తక్కిన॥)
చెల్లుగడి గని చేసినచేఁతలు
చల్లనిమాటల సడి వాసె
తొల్లిటిదాననె తొడిఁబడఁ జెక్కులు
యిల్లిదె నొక్కే విదేఁటికయ్యా

(॥తక్కిన॥)
పన్నిన మాయలఁ బాసినకాఁకలు
కన్నుల నవ్వుల కసి దీరె
చిన్నదాననె చేతికి లోనె
చన్నులు ముట్టేవు సట లేలయ్యా

(॥తక్కిన॥)
అండనె కాఁగిట నలసిన అలయిక
నిండు మోవితేనెలఁ దేరె
వెండియు నిటు శ్రీ వెంకటేశ నమ
మెండుగఁ గూడితి మెచ్చితి నయ్యా

(||pallavi||)
takkina suddulu taḍava mim̐ka
sŏkkulam̐ bĕṭṭusu sŏlayaguvayyā

(||takkina||)
sĕllugaḍi gani sesinasem̐talu
sallanimāḍala saḍi vāsĕ
tŏlliḍidānanĕ tŏḍim̐baḍam̐ jĕkkulu
yillidĕ nŏkke videm̐ṭigayyā

(||takkina||)
pannina māyalam̐ bāsinagām̐kalu
kannula navvula kasi dīrĕ
sinnadānanĕ sedigi lonĕ
sannulu muṭṭevu saḍa lelayyā

(||takkina||)
aṁḍanĕ kām̐giḍa nalasina alayiga
niṁḍu movidenĕlam̐ derĕ
vĕṁḍiyu niḍu śhrī vĕṁkaḍeśha nama
mĕṁḍugam̐ gūḍidi mĕchchidi nayyā