తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన
(॥పల్లవి॥)
తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన
జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి
(॥తగు॥)
కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా
సమ్మతించి రుక్ష్మిణి జయలక్ష్మి
అమ్ము మొనను జలది నడఁచి లంక సాదించి
కమ్మరఁ జే కొన్నసీతే ఘనవీరలక్ష్మి
(॥తగు॥)
నరకాసురు నడఁచి నవ్వుతాఁ జేయివేసితివి
సరిగా సత్యభామే పో సంగ్రామలక్ష్మి
హిరణ్యకశిపుఁ గొట్టి యింద్రాదులకు నీచే
వరమిప్పించినయాకే వరలక్ష్మి
(॥తగు॥)
నిండినవురముమీఁద నిఖిలసంపదలతో
అండనుండే యాకెపో ఆదిలక్ష్మి
మెండగుశ్రీ వేంకటాద్రిమీఁద నీసరుస నేఁగే
గండుమీరెఁ గళలతోఁ గల్యాణలక్ష్మి
(||pallavi||)
tagunayya hari nīgu dānamu dĕchchugŏnina
jagamulo bhūgāṁta saubhāgyalakṣhmi
(||tagu||)
kimmula śhiśhubāluni gĕlisi segŏṁṭivigā
sammadiṁchi rukṣhmiṇi jayalakṣhmi
ammu mŏnanu jaladi naḍam̐si laṁka sādiṁchi
kammaram̐ je kŏnnasīde ghanavīralakṣhmi
(||tagu||)
naragāsuru naḍam̐si navvudām̐ jeyivesidivi
sarigā satyabhāme po saṁgrāmalakṣhmi
hiraṇyagaśhibum̐ gŏṭṭi yiṁdrādulagu nīse
varamippiṁchinayāge varalakṣhmi
(||tagu||)
niṁḍinavuramumīm̐da nikhilasaṁpadalado
aṁḍanuṁḍe yāgĕbo ādilakṣhmi
mĕṁḍaguśhrī veṁkaḍādrimīm̐da nīsarusa nem̐ge
gaṁḍumīrĕm̐ gaḽaladom̐ galyāṇalakṣhmi