Tagunaa nee kimtalesi damtadanaalu

తగునా నీ కింతలేసి దంటతనాలు
Language

(॥పల్లవి॥)
తగునా నీ కింతలేసి దంటతనాలు
నగినంతలోనె యానలు వెట్టఁజెల్లునా

(॥తగు॥)
కలికి తనపతికి గందము కానుకంపితే
బలిమిఁ దీసి యేల కంబానఁ బూసేవే
వెలయ నప్పటి నాపె వీడెము వెట్టి యంపితే
పలుమారుఁ జెలులకు పంచిపెట్టనేఁటికే

(॥తగు॥)
మంచిపువ్వుదండ లాపె మగనికి నంపితేను
కొంచకేల నీమంచముకోటఁ జుట్టేవే
మించుఁగడియా లాకె మెలుఁతచే నంపితేను
పించేవు నీపాదమునఁ బెట్టవచ్చునటవే

(॥తగు॥)
యెనసి శ్రీవేంకటేశుఁ డిట్టె పాన్పు వేయించితే
మొనసి నీవేల పాదమునఁ దొక్కేవే
అనిశము నేలె నీతఁ డలమేలుమంగవు నిన్ను
తనిసి యాపెకు నిఁక దాఁచవచ్చునటవే

(||pallavi||)
tagunā nī kiṁtalesi daṁṭadanālu
naginaṁtalonĕ yānalu vĕṭṭam̐jĕllunā

(||tagu||)
kaligi tanabadigi gaṁdamu kānugaṁpide
balimim̐ dīsi yela kaṁbānam̐ būseve
vĕlaya nappaḍi nābĕ vīḍĕmu vĕṭṭi yaṁpide
palumārum̐ jĕlulagu paṁchibĕṭṭanem̐ṭige

(||tagu||)
maṁchibuvvudaṁḍa lābĕ maganigi naṁpidenu
kŏṁchagela nīmaṁchamugoḍam̐ juṭṭeve
miṁchum̐gaḍiyā lāgĕ mĕlum̐tase naṁpidenu
piṁchevu nībādamunam̐ bĕṭṭavachchunaḍave

(||tagu||)
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ pānpu veyiṁchide
mŏnasi nīvela pādamunam̐ dŏkkeve
aniśhamu nelĕ nīdam̐ ḍalamelumaṁgavu ninnu
tanisi yābĕgu nim̐ka dām̐savachchunaḍave