తగుఁదగునయ్యా మీ ఇద్దరికి నేఁడు
(॥పల్లవి॥)
తగుఁదగునయ్యా మీ ఇద్దరికి నేఁడు
చిగురువలపులెల్లా సేసలై నిలిచెను
(॥తగుఁ॥)
కూరిమి నిన్నుఁ గొసరికొసరి తప్పకచూచీ
చేరఁడేసికన్ను లచెలియ
మారుకుమారు నీవు మరి తప్పకచూచితే
బోరనఁ గలువలతో పూజలై నిలిచెను
(॥తగుఁ॥)
వొట్టుక నిన్ను నొరసి వొరయుచుఁ జెనకీని
పట్టెఁడేసిగుబ్బలపడఁతి
ఱట్టడితనాన నీవాఱడిఁ జేతులు చాఁచితే
పొట్టఁ బొరుగునఁ దమ్మిపూజలై నిలిచెను
(॥తగుఁ॥)
ముందుముందె మోవితేనె ముంచిముంచి అందియిచ్చె
అందీ కొణిఁదెఁడు మోవిఅతివ
కందువ శ్రీవేంకటేశ కలసి నీవూ నిచ్చితే
పొందుల సంపెఁగపువ్వుపూజలై నిలిచెను
(||pallavi||)
tagum̐dagunayyā mī iddarigi nem̐ḍu
siguruvalabulĕllā sesalai nilisĕnu
(||tagum̐||)
kūrimi ninnum̐ gŏsarigŏsari tappagasūsī
seram̐ḍesigannu lasĕliya
mārugumāru nīvu mari tappagasūside
boranam̐ galuvalado pūjalai nilisĕnu
(||tagum̐||)
vŏṭṭuga ninnu nŏrasi vŏrayusum̐ jĕnagīni
paṭṭĕm̐ḍesigubbalabaḍam̐ti
ṟaṭṭaḍidanāna nīvāṟaḍim̐ jedulu sām̐side
pŏṭṭam̐ bŏrugunam̐ dammibūjalai nilisĕnu
(||tagum̐||)
muṁdumuṁdĕ movidenĕ muṁchimuṁchi aṁdiyichchĕ
aṁdī kŏṇim̐dĕm̐ḍu moviadiva
kaṁduva śhrīveṁkaḍeśha kalasi nīvū nichchide
pŏṁdula saṁpĕm̐gabuvvubūjalai nilisĕnu