Tagumdagu neegu nivi tappugaadu

తగుఁదగు నీకు నివి తప్పుగాదు
Language

(॥పల్లవి॥)
తగుఁదగు నీకు నివి తప్పుగాదు
జగడించేనా నేను సారెఁ గొంచనేఁటికి

(॥తగు॥)
చలరేఁగి నీవాపెకుఁ జెప్పిపంపిన సుద్దులు
యెలమి నాపె నాకు యెరిఁగించెను
కలిగినపను లివి కమ్మటి దాఁచఁగనేల
వలదనేనా నేను వట్టి మఱఁగేఁటికి

(॥తగు॥)
సుదతికి నీవిచ్చనసొమ్ము లన్నియును నాకు
ముదమున జూపి కడు ముచ్చటాడెను
గుదిగొన్న వలపులు గుట్టు సేయఁగనేల
యెదుటఁ గోపగించేనా ఇఁకఁ గొంకనేఁటికి

(॥తగు॥)
మగువఁ గాఁగిటఁ గూడి మన్నించినమన్ననలు
పగటున మెచ్చి నాతోఁ బచారించెను
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
యెగసక్కె మాడేనా యిన్నిబాసలేఁటికి

(||pallavi||)
tagum̐dagu nīgu nivi tappugādu
jagaḍiṁchenā nenu sārĕm̐ gŏṁchanem̐ṭigi

(||tagu||)
salarem̐gi nīvābĕgum̐ jĕppibaṁpina suddulu
yĕlami nābĕ nāgu yĕrim̐giṁchĕnu
kaliginabanu livi kammaḍi dām̐sam̐ganela
valadanenā nenu vaṭṭi maṟam̐gem̐ṭigi

(||tagu||)
sudadigi nīvichchanasŏmmu lanniyunu nāgu
mudamuna jūbi kaḍu muchchaḍāḍĕnu
gudigŏnna valabulu guṭṭu seyam̐ganela
yĕduḍam̐ gobagiṁchenā im̐kam̐ gŏṁkanem̐ṭigi

(||tagu||)
maguvam̐ gām̐giḍam̐ gūḍi manniṁchinamannanalu
pagaḍuna mĕchchi nādom̐ basāriṁchĕnu
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
yĕgasakkĕ māḍenā yinnibāsalem̐ṭigi