తగుఁ దగు నీకూ నీకు దక్కె జవ్వన ఫలము
(॥పల్లవి॥)
తగుఁ దగు నీకూ నీకు దక్కె జవ్వన ఫలము
అగపడ్డ సంతోస మేమని చెప్పే మిపుడూ
(॥॥)
సేయఁగఁ జేయఁగ నిక్కెఁ జెలిమి
పాయనీదు తమకపు బలిమి
కాయపుఁ జక్కఁ దనాల కలిమీ
ఆయాలు సోఁకిన మిమ్మేమని చెప్పే మిపుడూ
(॥॥)
వడిగొనె మీ యిద్దరి వలపు
తడఁ బడీ మీలో మీతలఁపు
పెడరేఁ చీఁ బెదవుల పిలుపు
అడరె మీ సొబగు లేమని చెప్పే మిపుడూ
(॥॥)
ననిచిన మీ రతుల ననుపు
పొనగొన్న కౌఁగిళ్ళ పెనపు
మొనసె శ్రీ వేంకటేశ మునుపు
అనువాయ మీచేఁత లేమని చెప్పే మిపుడూ
(||pallavi||)
tagum̐ dagu nīgū nīgu dakkĕ javvana phalamu
agabaḍḍa saṁtosa memani sĕppe mibuḍū
(||||)
seyam̐gam̐ jeyam̐ga nikkĕm̐ jĕlimi
pāyanīdu tamagabu balimi
kāyabum̐ jakkam̐ danāla kalimī
āyālu som̐kina mimmemani sĕppe mibuḍū
(||||)
vaḍigŏnĕ mī yiddari valabu
taḍam̐ baḍī mīlo mīdalam̐pu
pĕḍarem̐ sīm̐ bĕdavula pilubu
aḍarĕ mī sŏbagu lemani sĕppe mibuḍū
(||||)
nanisina mī radula nanubu
pŏnagŏnna kaum̐giḽḽa pĕnabu
mŏnasĕ śhrī veṁkaḍeśha munubu
anuvāya mīsem̐ta lemani sĕppe mibuḍū