తగులు వీరికి గుఱి తాఁ దానే
(॥పల్లవి॥)
తగులు వీరికి గుఱి తాఁ దానే
తగు జీవుఁడు మఱి తాఁ దానే
(॥తగులు॥)
పలువుపమలచే బ్రహ్మాండకోట్లు
తలఁచే తలఁపులు తనలోనే
వులుకక నానాయోనిబంధముల
తలఁగనియ్య దిది తనలోనే
(॥తగులు॥)
సతతము భువిపై చవులు సారములు
తతి నిండు కొనెను తనలోనే
రతుల కామినుల రచన లెల్లను స
తతమును భోగించెఁడి దనలోనే
(॥తగులు॥)
ధనధాన్యము లెంతయు నార్జించిన
తనయఁ డింతైన తనలోనే
ఘనుఁడగు శ్రీవేంకటపతి యున్నాఁడు
తనువు దాల్చుకొని తనలోనే
(||pallavi||)
tagulu vīrigi guṟi tām̐ dāne
tagu jīvum̐ḍu maṟi tām̐ dāne
(||tagulu||)
paluvubamalase brahmāṁḍagoṭlu
talam̐se talam̐pulu tanalone
vulugaga nānāyonibaṁdhamula
talam̐ganiyya didi tanalone
(||tagulu||)
sadatamu bhuvibai savulu sāramulu
tadi niṁḍu kŏnĕnu tanalone
radula kāminula rasana lĕllanu sa
tadamunu bhogiṁchĕm̐ḍi danalone
(||tagulu||)
dhanadhānyamu lĕṁtayu nārjiṁchina
tanayam̐ ḍiṁtaina tanalone
ghanum̐ḍagu śhrīveṁkaḍabadi yunnām̐ḍu
tanuvu dālsugŏni tanalone