తగులాయఁ బొందులు తనకూ నాకూ
(॥పల్లవి॥)
తగులాయఁ బొందులు తనకూ నాకూ
తగు నిద్దరి కనవే తలపోయ నెపుడూ
(॥॥)
శిరసు వంచితి నెంతే సిగ్గులు రేఁగఁ గాను
గరువముగా దనవే కాంతునితోను
విరుల వేసితి నెంతే వేడుకలు గాఁగాను
విరసము లే దనవే వే వేలకు నేఁ డూ
(॥॥)
యింతలో నవ్వితే నెంతే యిచ్చకము గాఁగాను
పంతము గా దనవే పలుమారును
సంతోసించుకొంటి నెంతే చవిగా మాటాడఁగాను
రంతుసేయ ననవే రవ్వగా నేనూ
(॥॥)
కలసితి నెంతే రతిఁ గౌగిలించుకొనఁ గాను
అలయించ ననవే అంకెలఁ దన్ను
యెలమి శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
సొలయ ననవే తానే సొంపుగా నన్నేలెనూ
(||pallavi||)
tagulāyam̐ bŏṁdulu tanagū nāgū
tagu niddari kanave talaboya nĕbuḍū
(||||)
śhirasu vaṁchidi nĕṁte siggulu rem̐gam̐ gānu
garuvamugā danave kāṁtunidonu
virula vesidi nĕṁte veḍugalu gām̐gānu
virasamu le danave ve velagu nem̐ ḍū
(||||)
yiṁtalo navvide nĕṁte yichchagamu gām̐gānu
paṁtamu gā danave palumārunu
saṁtosiṁchugŏṁṭi nĕṁte savigā māḍāḍam̐gānu
raṁtuseya nanave ravvagā nenū
(||||)
kalasidi nĕṁte radim̐ gaugiliṁchugŏnam̐ gānu
alayiṁcha nanave aṁkĕlam̐ dannu
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
sŏlaya nanave tāne sŏṁpugā nannelĕnū