తగులాయ నిఁకనేలే తడఁబాట్లు
(॥పల్లవి॥)
తగులాయ నిఁకనేలే తడఁబాట్లు
మొగిగొనె వలపుల మొగమోఁటలు
(॥తగు॥)
పెనఁగేరమణునికిఁ బ్రియమే సేతువుగాక
కనుచూపులలోనేలే కసుఁగాట్లు
ననిచినవేళను నవ్వు నవ్వుదువుగాక
మొనచేతులలోనేలే ములవాండ్లు
(॥తగు॥)
మక్కువ మగనితోడ మంచిమాటాడుదువుగాక
చక్కెరమోవి నేలే చప్పుచారులు
చెక్కులు నీకు నొక్కఁగా సేదదేరుదువుగాక
ముక్కుల చన్నులనేలే మొనపోట్లు
(॥తగు॥)
కలసి శ్రీవేంకటేశుఁ గాఁగిలించుకొందుగాక
నిలుగులమేననేలే నిండుసిగ్గులు
తలకొన్నరతులలోఁ దమితో నుందువుగాక
అలవి మీరి యేలే అసురుసురు
(||pallavi||)
tagulāya nim̐kanele taḍam̐bāṭlu
mŏgigŏnĕ valabula mŏgamom̐ṭalu
(||tagu||)
pĕnam̐geramaṇunigim̐ briyame seduvugāga
kanusūbulalonele kasum̐gāṭlu
nanisinaveḽanu navvu navvuduvugāga
mŏnasedulalonele mulavāṁḍlu
(||tagu||)
makkuva maganidoḍa maṁchimāḍāḍuduvugāga
sakkĕramovi nele sappusārulu
sĕkkulu nīgu nŏkkam̐gā sedaderuduvugāga
mukkula sannulanele mŏnaboṭlu
(||tagu||)
kalasi śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁchugŏṁdugāga
nilugulamenanele niṁḍusiggulu
talagŏnnaradulalom̐ damido nuṁduvugāga
alavi mīri yele asurusuru