తగుదువమ్మ నీ వందపుమరుతండ్రికి
(॥పల్లవి॥)
తగుదువమ్మ నీ వందపుమరుతండ్రికి
మొగిఁ దచ్చినమృతము మోవి నుందిగాన
(॥తగు॥)
కోమలి నీజవ్వనము కొలఁదివెట్టఁగరాదు
ప్రేమమున మీఁదమీఁదఁ బెరిగీఁగాన
ఆమని నీసింగార మంత ఇంత యనరాదు
వేమారు నీచూపు వెల్లి విరిసీఁ గాన
(॥తగు॥)
తొయ్యలి నీవొరపులు తులదూఁచి చెప్పరాదు
నెయ్యపునీతురు మిదె నిక్కీఁగాన
చయ్యన నీసొబగు లిచ్చట నియమించరాదు
అయ్యెడ నీపిఱుఁదున కలవిలేదుగాన
(॥తగు॥)
వనిత నీభావ మిఁక వర్ణించిపలుకరాదు
కొన నీపాదములు చిగురులుగాన
తనరునీభాగ్యము తలఁచ నలవిగాదు
ఘనుఁడు శ్రీవేంకటేశుఁగలసితిగాన
(||pallavi||)
taguduvamma nī vaṁdabumarudaṁḍrigi
mŏgim̐ dachchinamṛtamu movi nuṁdigāna
(||tagu||)
komali nījavvanamu kŏlam̐divĕṭṭam̐garādu
premamuna mīm̐damīm̐dam̐ bĕrigīm̐gāna
āmani nīsiṁgāra maṁta iṁta yanarādu
vemāru nīsūbu vĕlli virisīm̐ gāna
(||tagu||)
tŏyyali nīvŏrabulu tuladūm̐si sĕpparādu
nĕyyabunīduru midĕ nikkīm̐gāna
sayyana nīsŏbagu lichchaḍa niyamiṁcharādu
ayyĕḍa nībiṟum̐duna kalaviledugāna
(||tagu||)
vanida nībhāva mim̐ka varṇiṁchibalugarādu
kŏna nībādamulu sigurulugāna
tanarunībhāgyamu talam̐sa nalavigādu
ghanum̐ḍu śhrīveṁkaḍeśhum̐galasidigāna