Tagu neegu nittijaanadanamu lellaa

తగు నీకు నిట్టిజాణతనము లెల్లా
Language

(॥పల్లవి॥)
తగు నీకు నిట్టిజాణతనము లెల్లా
మిగులా మావంటివారు మెచ్చిరి నిన్నిపుడు

(॥తగు॥)
పడఁతి విడెమియ్యఁగా జన్నులు చేతఁబట్టేవు
చిడిముడితోఁ జన్నులు చేతబట్టేవు
జడియ కాపెపయ్యద సారెసారె సోదించేవు
బడి నీవిడెమేమైనా పయ్యదలో నున్నదా

(॥తగు॥)
ఇంతి కైలా గియ్యఁగాను యెఱఁగని వానివలె
వింతలేక ఆపెవొడి వెసఁబట్టేవు
పొంతనే యప్పటి నాపెపోఁకముడి విడిచేవు
కాంతవొడిలో నీకుఁగైదండ వున్నదా

(॥తగు॥)
కలికి యద్దము చూపఁగా భ్రమసేవానివలె
నిలిచి యాపెచెక్కుల నీడచూచేవు
మలసి శ్రీవేంకటేశ మరీఁ దమకించి కూడే
వలమేల్మంగచెక్కుల నద్దము నీకున్నదా

(||pallavi||)
tagu nīgu niṭṭijāṇadanamu lĕllā
migulā māvaṁṭivāru mĕchchiri ninnibuḍu

(||tagu||)
paḍam̐ti viḍĕmiyyam̐gā jannulu sedam̐baṭṭevu
siḍimuḍidom̐ jannulu sedabaṭṭevu
jaḍiya kābĕbayyada sārĕsārĕ sodiṁchevu
baḍi nīviḍĕmemainā payyadalo nunnadā

(||tagu||)
iṁti kailā giyyam̐gānu yĕṟam̐gani vānivalĕ
viṁtalega ābĕvŏḍi vĕsam̐baṭṭevu
pŏṁtane yappaḍi nābĕbom̐kamuḍi viḍisevu
kāṁtavŏḍilo nīgum̐gaidaṁḍa vunnadā

(||tagu||)
kaligi yaddamu sūbam̐gā bhramasevānivalĕ
nilisi yābĕsĕkkula nīḍasūsevu
malasi śhrīveṁkaḍeśha marīm̐ damagiṁchi kūḍe
valamelmaṁgasĕkkula naddamu nīgunnadā